TIFFIN – చేసేందుకు దిగితే – 28 లక్షలు మాయం

నల్గోండ, జూలై 26, (ఇయ్యాల తెలంగాణ) : డబ్బులుతో, విలువైన వస్తువులతో ఓ చోటు నుంచి మరోచోటుకి ప్రయాణాలు చేసేటప్పుడు గమ్యం చేరేవరకు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే ఎక్కడైనా.. ఏ చోటైనా మనకు తెలియకుండానే అవి పడిపోవచ్చు.. లేదా ఎవరైనా దొంగతనం చేయొచ్చు.. చాలామందికి ఇలాంటి అనుభవాలు ఎదురై ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా అచ్చం అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణస్తున్న ఓ వ్యక్తి టిఫిన్‌ చేసేందుకు కిందికి దిగడంతో ఏకంగా రూ.28 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ భారీ చోరీ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్‌ వద్ద చోటుచేసుకుంది.ఒడిశాలోని బరంపురం అనే ప్రాంతం నుంచి ఓ ఆరెంజ్‌ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు హైదరాబాద్‌కు వెళ్తోంది. అయితే ఈ బస్సు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి శివారులోని ఓ హోటల్‌ వద్ద ఆగింది. బస్సులో ఉన్న ఓ వ్యక్తి టిఫిన్‌ చేసేందుకుని బస్సు దిగి ఆ హోటల్‌కు వెళ్లాడు. 

ఆ బస్సులో అతనికి సంబంధించిన రెండు బ్యాగులు ఉన్నాయి. అందులోని ఓ బ్యాగులో రూ.24 లక్షలు ఉండగా.. మరో బ్యాగులో రూ.4 లక్షలు ఉన్నాయి. అయితే ఈ క్రమంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి అక్కడికి వచ్చి ఆ బస్సులోకి చొరబడ్డాడు. ఆ డబ్బులు ఉన్న రెండు బ్యాగులను తీసుకుని పారిపోయాడు. దీంతో ఆ బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలో కూడా నార్కట్‌పల్లి హోటల్‌ వద్ద ఇలానే రెండు, మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ దొంగతనం జరిగే సమయంలో బస్సు సిబ్బందితో పాటు 27 మంది ప్రయాణికులు ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....