Telangana అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం Fix

హైదరాబాద్‌ , డిసెంబర్ 26 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ శీతకాల అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది. 2025, డిసెంబర్‌ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు గవర్నర్‌ ఆమోదంతో తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు  నోటిఫికేషన్‌ జారీ చేశారు. అసెంబ్లీ సెషన్‌ ప్రారంభమైన తర్వాత సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై బీఏసీ బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ, సమావేశంలో నిర్ణయం తీసుకో నున్నారు.ఈ సెషన్‌?లో కృష్ణా,గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు`రంగారెడ్డి సహా పెండిరగ్‌ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోన్నట్లు సమాచారం. అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీపీ ఎన్నికలు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రణాళిక గురించి హౌస్‌?లో డిస్కస్‌ చేయనున్నట్లు సమాచారం.ఓ వైపు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వంపై కేసీఆర్‌ విమర్శలు చేయడం..మరోవైపు ఆయనకు కౌంటర్‌?గా అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌ విసరడంతో ఈ సెషన్‌?పై ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్‌ పార్టీ ఓటమి పాలైనప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న అపొజిషన్‌ లీడర్‌ కేసీఆర్‌,ఈ సారైనా అసెంబ్లీకి వస్తారా లేదా అనే దానిపై ఆసక్తి నెలకొంది. స

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....