Telangana లో Teachers ప్రమోషన్స్‌ List రెడీ !

హైదరాబాద్‌, జూన్‌ 18, (ఇయ్యాల తెలంగాణ)  : తెలంగాణలో ఉపాధ్యాయులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పనుంది. 15 ఏళ్ల నుంచి పెండిరగ్‌లో ఉన్న ప్రమోషన్స్‌ ఫైల్‌ సిద్ధమైంది. ఆమోదించిన తర్వాత దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఏ క్షణంలోనైనా వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముందుగా మల్టీజోన్‌ వన్‌  పరిధిలో ప్రమోషన్లు క్లియర్‌ చేయనున్నారు. వరంగల్‌ పరిధిలోని దాదాపు 10 వేల మంది ఉపాధ్యాయులకు ముందు గుడ్‌ న్యూస్‌ రానుంది. తర్వాత హైదరాబాద్‌ పరిధిలోని ఉపాధ్యాయులకు స్వీట్‌ చెప్పనుంది ప్రభుత్వం. మల్టీజోన్‌ వన్‌ పరిధిలో 19 జిల్లాలు ఉన్నాయి. అక్కడ పదివేల మందికిపై ఉపాధ్యాయులు పదోన్నతి కోసం ఎదురు చూస్తున్నారు. 

ఈ జీవో వస్తే దాదాపు 4900 మంది లాంగ్వేజ్‌ పండిట్లు, 900 మంది పీఈటీలకు ప్రమోషన లభించనుంది. ఇప్పుడు ఉన్న లాంగ్వేజ్‌ పండిట్లు స్కూల్‌ అసిస్టెంట్‌ లాంగ్వేజ్‌ పండిట్లుగా, పీఈటీలు, ఫిజికల్‌ డైరెక్టర్లుగా, ఎస్జీలు, స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్‌ పొందుతారు. ఈ ప్రమోషన్‌ లిస్టులో ఎక్కువ మంది లాంగ్వేజ్‌ పండిట్లు, పీఈటీలే ఉన్నారు. మల్టీ జోన్‌ వన్‌ పరిధిలో దాదాపు ఐదు వేల మంది లాంగ్వేజ్‌ పండిట్లు, వెయ్యి మంది పీఈటీలు ప్రమోషన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది నిజామాబాద్‌ జిల్లా, ఖమ్మంలో జిల్లాలో ఉన్నారు. ప్రమోషన లభించిన ఉపాధ్యాయుడికి రెండు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. మొదటి జోన్‌ ప్రమోషన్‌ ప్రక్రియ పూర్తౌెన తర్వాత రెండో మల్టీ జోన్‌ పరిధి ప్రమోషన్‌ ఉత్తర్వులు రానున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రెండో మల్టీజోన్‌లో 14 జిల్లాల ఉపాధ్యాయులు ప్రమోషన్స్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....