Telangana లో శాంతి భద్రతలు దారుణంగా వున్నాయి

బీఆర్‌ఎస్‌ నేతలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి

హైదరాబాద్‌, 

నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డా.ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌,మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు,మర్రి జనార్దన్‌ రెడ్డి,హర్షవర్ధన్‌ రెడ్డి తదితరులు అచ్చంపేటలో కాంగ్రెస్‌ గుండాలు బీఆర్‌ఎస్‌ నాయకులపై చేసిన దాడులపై రాష్ట్ర డీజీపీ కి ఫిర్యాదు చేసారు.

డా.ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ అచ్చంపేట నియోజకవర్గంలో రాజకీయ కక్షతో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ సుంకరి నిర్మల బాలరాజు ఇంటిపై కాంగ్రెస్‌ గుండాలు మరణాయుధాలతో దాడి చేసి, హత్యాయత్నం చేసినా  నిందితులను పోలీసులు అరెస్టు చేయడంలో విఫలమయ్యారని అన్నారు.

వంగూరు మండలంలో పోలింగ్‌ రోజు బిఆరెస్‌ నాయకులపై కాంగ్రెస్‌ గూండాలు దాడులు చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంపై విచారణ జరిపి,చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత నియోజకవర్గం అచ్చంపేటలో అధికార పార్టీ నాయకులు  గుండాల్లా ప్రవర్తిస్తూ, బీఆర్‌ఎస్‌ నాయకులపై వరుస దాడులకు పాల్పడ్డారు.  కాంగ్రెస్‌ గుండాలతో బీఆర్‌ఎస్‌ నేతలకు ప్రాణహాని ఉందని, వారికి రక్షణ కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయి. చాలా ప్రాంతాలలో అధికార పార్టీ గుండాలు విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు. మళ్ళీ నైమ్‌ ముఠాలు బయటికొస్తున్నారు. స్థానిక వంశీకృష్ణ ఆధీనంలో ఆశ్రయం పొందుతున్నారు. జూపల్లి కృష్ణారావు ప్రోద్బలంతో నగర్‌ కర్నూల్‌ లో బిఆరెస్‌ నాయకులపై దాడులు చేస్తున్నారు. బిఆరెస్‌ నాయకులు పిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకుండా,అధికార పార్టీ నేతలు పిర్యాదు చేయగానే తీసుకుంటున్నారు. నగర్‌ కర్నూల్‌ లో పలు ప్రాంతాల్లో పికెటింగ్‌ వేయాలి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి అరాచకాలు జరగడం చాలా గోరం. కాంగ్రెస్‌ వచ్చి 6నెలలు కాకముందే అరాచక శక్తులు మళ్ళీ వారి కార్యక్రమాలు చేపట్టారు. ఇలాంటి గుండాలపై రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోకుంటే రాష్ట్రం అగ్నిగుండంగా మారె అవకాశం ఉందని అనమ్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....