Telangana లో ముగ్గురు సీనియర్‌ IPSలకు DGలుగా పదోన్నతి

హైదరాబాద్‌ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణలో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌లకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ కేసీఆర్‌ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌తో పాటు జితేందర్‌, రాజీవ్‌ రతన్‌లకు డీజీలుగా పదోన్నతి కల్పించింది. ఈ ముగ్గురు అదనపు డీజీలకు డీజీలుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం సీవీ. ఆనంద్‌ హైదరాబాద్‌ సీపీగా ఉన్నారు. రాజీవ్‌ రతన్‌.. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీగా ఉన్నారు. జితేందర్‌ హోంశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రెటరీగా కొనసాగుతున్నారు. త్వరలోనే రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి అనుకూలమైన అధికారులను బదిలీలు చేయడం, ప్రమోషన్లు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....