Telangana లో గృహజ్యోతి’ స్కీమ్‌ అర్హులకు అలర్ట్‌ “

హైదరాబాద్‌, జూలై 13  (ఇయ్యాల తెలంగాణ) : గృహజ్యోతి పథకానికి సంబంధించి దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ కీలక అప్డేట్‌ ఇచ్చింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు TSSPDCL  సీఎండీ ముషారఫ్‌ ఫరూఖీ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హత ఉన్న వాళ్లు వినియోగించుకోవాలని సూచించారు.తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ను అందించేం దుకు గృహజ్యోతి స్కీమ్‌ ను తీసుకొచ్చింది. ఇందుకోసం మార్గదర్శకాలను ఖరారు చేసిన లబ్ధిదా రులను గుర్తించింది. ప్రత్యేకంగా ప్రజాపాలన అనే కార్యక్రమం ద్వారా గ్రామాల్లో దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో ఉచితి విద్యుత్‌ స్కీమ్‌ కు సంబంధించిన దరఖాస్తుల్లో పలువురు విద్యుత్‌ కనెక్షన్‌ నంబరును తప్పుగా ఎంట్రీ చేసి ఇచ్చారు. ఫలితంగా ఇలాంటి వారు అర్హత ఉన్నప్పటికీ జోరో బిల్లులు జనరేట్‌ కావటం లేదు.ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా సవరణ చేసే అవకాశం కల్పించారు. అర్హులైన వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ సరఫరా అందిస్తామని? ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఏమైనా తప్పులు ఉంటే సవరణ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

జులై 1 నుంచి ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి విద్యుత్‌ బిల్లులు చెల్లింపు ప్రక్రియలో మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఫోన్‌ పే, గూగుల్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి యాప్‌ల ద్వారా చెల్లించడం నిలిపివేసినట్లు విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఇటీవలే ప్రకటన చేశాయి. దీంతో చాలా మంది వినియోగదారులు చెల్లింపుల విషయంలో కాస్త గందరగోళానికి గరువుతున్నారు. మళ్లీ కరెంట్‌ ఆఫీసులకు వెళ్లి పేమెంట్‌ చేయాలా..? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే వినియోగదారులు గతంలో మాదిరిగానే సింపుల్‌ గా పేమెంట్‌ చేసే అవకాశం ఉంది. ఈ విషయంలో టెన్షన్‌ పడాల్సిన అవసరమే లేదు. ముందుగా విూరుTSSPDCL  అధికారిక వెబ్‌ సైట్‌ లోకి వెళ్లాలి. హోం పేజీలోనే బిల్‌ పేమెంట్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇందులో వివరాలను నమోదు చేసి సింపుల్‌ గా కరెంట్‌ బిల్లును క్లియర్‌ చేసుకోవచ్చు. కేవలం వెబ్‌ సైట్‌ మాత్రమే కాదు? యాప్‌ ను కూడా ఇన్‌ స్టాల్‌ చేసుకోని ఈ ప్రక్రియను కంప్లీట్‌ చేయవచ్చు.

విూ కరెంట్‌ బిల్లును ఇలా కట్టేయండి?..

విద్యుత్‌ వినియోగదారుడు బిల్లు చెల్లించేందుకు ముందుగా https://www.tssouthernpower.com/ వెబ్‌ సైట్‌ లోకి వెళ్లాలి.

హోం పేజీలో https://apps.apple.com/in/app/tsspdcl/ అనే ఆప్షన్పై కనిపిస్తుంది. దీనిపై నొక్కాలి.

ఇక్కడ విూరు ఉపయోగించే  నెంబర్‌ను నమోదు చేసి సబ్మిట్‌ బటన్‌ పై నొక్కాలి.

బిల్‌కు సంబంధించిన వివరాలను డిస్‌ ప్లే అవుతాయి. ఆ తర్వాత Telangana Electricity Bill Pay అనే అప్షన్ పై నొక్కాలి.    

ఇక్కడ మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇందులో బిల్లు చెల్లించేందుకు రకరకాల ఆప్షన్లు కనిపిస్తాయి. ఇందులో ఒక దానిని సెలక్ట్‌ చేసుకోవాలి. ఇక్కడ డిబెట్‌ కార్డు లేదా ు చిజీశ్రీశ్రీవబి వంటి ఆప్షన్లు ఉంటాయి. విూకు అనువుగా ఉన్న దానిని ఎంపిక చేసి బిల్‌ క్లియర్‌ చేసుకోవచ్చు.

ఇక వెబ్‌ సైట్‌ ద్వారానే కాకుండా? www.tssouthernpower.com యాప్‌ నుంచి కూడా ప్రాసెస్‌ పూర్తి చేయవచ్చు. ఇందుకోసం ముందుగా వినియోగదారుడు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి ుఉూఖఆఅఒ యాప్‌ను డౌన్లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్‌ స్టాల్‌ అయ్యాక?. బిల్‌ పేమెంట్‌ చేసుకోవచ్చు. ఇక వెబ్‌ సైట్‌, యాప్‌ ద్వారా కాకుండా? విూసేవా కేంద్రాలకు వెళ్లి కూడా పేమెంట్‌ చేయవచ్చు. ఇక విూకు దగ్గర్లోనే కరెంట్‌ ఆఫీస్‌ కేంద్రం ఉంటే అక్కడ కూడా పెండిరగ్‌  బిల్లలను క్లియర్‌ చేయవచ్చు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....