Telangana లో ఆయిల్‌ పామ్‌, ఉద్యాన పంటల సూక్ష్మ సేద్యం కొరకు పెద్ద ఎత్తున రాయితీలు

హైదరాబాద్‌ జూన్‌ 19 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో పెరిగిన పంట మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా, తెలంగాణ ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలలో సూక్ష్మ సేద్యం కొరకు రాయితీలు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి  తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.2023`24 సం.కి గాను 59,261 ఎకరాలు కొత్తగా ఆయిల్‌ పామ్‌ సాగులోకి తీసుకురావడం జరిగింది. 2023`24 సం.కి గాను ఆయిల్‌ పామ్‌ సాగు పధకం (ఔఓఇూ`ూఖ) కింద, కేంద్ర ప్రభుత్వం రూ.80.10 కోట్లను విడుదల చేయడం జరిగింది. దీనికి రూ.53.40 కోట్ల రాష్ట్ర వాటా కలుపుకుని మొత్తం రూ.133.50 కోట్లు విడుదల చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగింది. ఈ మొత్తంలో 2023`24 సం.లో కేవలం రూ.32.72 కోట్లు మాత్రమే విడుదల చేయగా, వివిధ కారణాల చేత రూ.100.76 కోట్లు పెండిరగ్‌ లో పెట్టడం జరిగింది. దీని వలన ఉద్యాన శాఖ, రైతులకు మరియు ఆయిల్‌ పామ్‌/ డ్రిప్‌ కంపెనీలకు, సకాలంలో బకాయిలు విడుదల చేయడం వీలుపడలేదు.చొరవతో, గౌ.ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి ఆయిల్‌ పామ్‌ రైతుల మరియు కంపెనీల ఇబ్బందులను తీసుకురాగ, పెండిరగ్‌ లో వున్న రూ.100.76 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని 2`3 రోజులలో ఆయిల్‌ పామ్‌ తోటల నిర్వహణ మరియు అంతర పంటల సాగుకు సంబందించిన రాయితీలను, రైతుల ఖాతాలలో జమ చేయుటకు ఉద్యానశాఖ చర్యలు తీసుకోవడం జరుగుతున్నది.          

ఇదే విధంగా, 2022`23 సం. నుండి విడుదల కావలసివున్న సూక్ష్మ సేద్యానికి సంబందించి, రూ.55.36 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ మొత్తాన్ని అయిల్‌ పామ్‌ మరియు ఇతర పంటలలో  డ్రిప్‌ పరికరాలను రైతు పంట పొలంలో అమర్చిన సూక్ష్మ సేద్య  కంపనీలకు పెండిరగ్‌ లో ఊన్న బకాయిలుగాను విడుదల చేయడం జరిగింది. బకాయిలు విడుదలైనందువలన 2024`25 సంవత్సరానికి గాను నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకొనేవిధంగా రైతులను ఆయిల్‌ పామ్‌ చేపట్టుటకు ప్రొత్సహించవలసిందిగా ఉద్యాన అధికారులను మంత్రి  ఆదేశించడం జరిగింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....