Telangana రాష్ట్ర సచివాలయంలో UBI బ్రాంచి ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ) :  డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయ సముదాయం ప్రాగంణంలో ఏర్పాటు  చేసిన నూతన  యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  బ్రాంచి ని  ఈరోజు   ఉదయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ కారే భాస్కర్‌ రావు, రీజినల్‌ హెడ్‌ కె శ్రీధర్‌ బాబు,  బ్రాంచ్‌ చీఫ్‌ మేనేజర్‌ వి విజయ్‌ కుమార్‌ పాల్గొన్నారు.సచివాలయం ఉద్యోగులకు బ్యాంక్‌ ఉత్తమ సేవలు అందించేందుకు  బ్యాంక్‌ అధికారులు కృషి చేయాలని  సి ఎస్‌  కోరారు.  బ్యాంక్‌ అధికారులతో కలసి సి.ఎస్‌  స్ట్రాంగ్‌ రూమ్‌ , కంప్యూటర్‌ సెంటర్‌ ను పరిశీలించారు. ప్రస్తుతం బి.ఆర్‌.కె.ఆర్‌ భవన్‌ లో   సేవలు అందిస్తున్న బ్యాంకు బ్రాంచి  ఈ రోజు నుండి  నూతన కార్యాలయం ద్వారా సేవలు కొనసాగిస్తుందని  బ్యాంక్‌  చీఫ్‌ మేనేజర్‌ విజయ్‌ కుమార్‌ తెలిపారు. బ్యాంక్‌ అధికారులు, సిబ్బందికి  సిఎస్‌ శుభాకాంక్షలు  తెలిపారు.  ఈ  కార్యక్రమంలో బ్యాంక్‌  మేనేజర్‌ అనూష,   ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....