Telangana బీజేపీలో ఎన్నికల ఖర్చు పై రచ్చ..- హైకమాండ్‌ ఏం తేల్చబోతుంది?

హైదరాబాద్‌ మార్చ్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ కాషాయ పార్టీలో కొత్త రచ్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు విషయంలో పోటీ చేసిన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఫండ్‌ పక్కదారి పట్టిందని పలువురు నేతలు రచ్చకెక్కుతున్నారు.మరికొందరు అధిష్టానం వరకు ఈ వివాదాన్ని తీసుకువెళ్లారు. బీజేపీ హైకమాండ్‌ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఏం తేల్చబోతుంది ? లెక్కలు సరిచేస్తారా ? వదిలేస్తారా ?తెలంగాణపై బీజేపీ హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఆరా తీస్తోంది. ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్‌ దారితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బీజేపీ అభ్యర్థులు హస్తినకు ఫిర్యాదులు చేశారు. పార్టీ హైకమాండ్‌ ఇచ్చిన నిధులు కింది వరకు అందకపోవడంతో.. చాలా సెగ్మెంట్లలో పార్టీ ఓడిపోయిందని వారు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. రాష్ట్రానికి చెందిన పలువురు నేతల ఫిర్యాదు మేరకు నిధుల సంగతి తేల్చేందుకు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు చెందిన షాడో టీమ్‌ రంగంలోకి దిగిందని చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించి ఫండ్‌ కేటాయించిందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. నియోజకవర్గాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారని వారు వెల్లడిరచారు. ఏ కేటగిరీ అంటే గెలిచేదిగా, బీ అంటే కొంచెం కష్టపడితే గెలిచేదిగా, సీ కేటగిరి అంటే గెలిచే ఛాన్స్‌ లేకపోయినా.. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యం. అయితే పార్టీకి ఏమాత్రం బలం లేని పలు అసెంబ్లీ సెగ్మెంట్లకు భారీగా నిధులు సమకూర్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.అదే గెలుపునకు దగ్గరలో ఉన్నారనుకున్న సెగ్మెంట్లకు చాలా తక్కువ నిధులు కేటాయించడంతో ఓటమి పాలయ్యామని పలువురు పార్టీ అధిష్టానం ముందు ఆవేదన వ్యక్తం చేశారట. అభ్యర్థుల నుంచి అందిని ఫిర్యాదుల మేరకు అసలు..ఎవరికెంత ఇచ్చారనే దానిపై అమిత్‌ షా టీమ్‌ రంగంలోకి దిగిందని చెబుతున్నారు. ఈ వివరాలపై ఆరా తీస్తున్న హైకమాండ్‌ బృందానికి సర్దిచెప్పేందుకు రాష్ట్ర నాయకత్వం హైరానా పడుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....

View Comments (1)

  • Fund కష్టపడే నిజాయితీగా పని చేసిన కార్యకర్తలకు అందలేదు,స్వార్థపరులకు ఫండ్ వెళుతుంది తెలంగాణలో బీజేపీ బలంగా ఉన్న సమయంలో తప్పటడుగు వేసిన కేంద్రం నాయకత్వ మార్పు 40 సంవత్సరాల కష్టం నాశనం చేశారు మళ్ళీ పవర్లోకి రావడం కష్టం కార్యకర్తలను కష్టపెట్టకంది జై హింద్