Telangana ప్రభుత్వం రూపొందించిన యాంటీ డ్రగ్స్‌ యాడ్‌కు దర్శకత్వం వహించిన సంజీవ్‌ రెడ్డి

డ్రగ్స్‌ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో కోసం యాంటీ డ్రగ్‌ యాడ్‌ను తయారు చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఈ యాడ్‌ కు దర్శకత్వం వహించారు యంగ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి. ఈ యాడ్‌ ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చేతుల విూదుగా రిలీజైంది. ఈ యాడ్‌ ను టామాడ విూడియా ఎగ్జిక్యూట్‌ చేసింది. మెగాస్టార్‌ చిరంజీవి ఈ యాడ్‌ గురించి ట్వీట్‌ చేస్తూ డ్రగ్స్‌ వ్యతిరేక ప్రచారంలో భాగమైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వచ్చేవారం నుంచి ఈ యాడ్‌ ను తెలంగాణలోని ప్రతి థియేటర్‌ లో ప్రదర్శించబోతున్నారు.

డ్రగ్స్‌ కు బానిస కావడం వల్ల యువత తమ బంగారు భవిష్యత్తు ఎలా పాడుచేసుకుంటున్నారో ఈ యాడ్‌ లో ఆకట్టుకునేలా తెరకెక్కించారు సంజీవ్‌ రెడ్డి. డ్రగ్స్‌ అమ్మేవారు, కొనేవారిపై చర్యలు తీసుకుంటూనే డ్రగ్స్‌ కు బానిసైన వారికి చేయూత అందించి, వారిని మళ్లీ మంచి మార్గంలో పెట్టేందుకు తెలంగాణ యాంటీ నార్కొటిక్స్‌ బ్యూరో ఎలాంటి సపోర్ట్‌ అందిస్తుందో ఈ యాడ్‌ లో ఎఫెక్టివ్‌ గా చూపించారు సంజీవ్‌ రెడ్డి.

ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్‌ రెడ్డి స్పందిస్తూ ` ఎవరి సినిమాలు చూస్తూ పెరిగి సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నానో ఆ పద్మవిభూషణ్‌ మెగాస్టార్‌ చిరంజీవి గారు భాగస్వామి అయిన తెలంగాణ ప్రభుత్వ యాంటీ డ్రగ్‌ థియేట్రికల్‌ యాడ్‌ లో నేనూ ఒక భాగమైనందుకు, ఇక చాలు ఈ జన్మ కి అనిపిస్తుంది. కానీ, మళ్ళీ ఈ కోరికలకు అంతే ఉండదు. అని అన్నారు.

అల్లు శిరీష్‌ హీరోగా ‘‘ఏబీసీడీ’’ సినిమా, రాజ్‌ తరుణ్‌ తో ‘‘అహ నా పెళ్లంట’’ అనే వెబ్‌ సిరీస్‌ రూపొందించిన సంజీవ్‌ రెడ్డి…ప్రస్తుతం విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా ‘‘సంతాన ప్రాప్తిరస్తు’’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....