Telangana ప్రజలను అలర్ట్‌ చేసిన వాతావారణ శాఖ – ముసురు పట్టిన తెలుగు రాష్ట్రాలు

హైదరాబాద్‌, ఆగస్టు 31, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ప్రజలను వాతావారణ శాఖ అలర్ట్‌ చేసింది. శనివారం రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో వేగంతో కూడిన ఈదుగు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారి పశ్చిమ మధ్య మరియు దాని సవిూపంలోని పరిసర వాయువ్య బంగాళాఖాతం వద్ద కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పాకిస్థాన్‌ ఈశాన్య అరేబియా సముద్రం మాలేగాన్‌ , బ్రహ్మపురి జగదల్పూర్‌, కళింగపట్నం విూదుగా ఆగ్నేయ దిక్కులో కదులుతూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి విస్తరించింది.ఈ కారణంగా తెలంగాణ లోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరి కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. 

తెలంగాణలోని ఆదిలాబాద్‌, కొమరం భీం, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.అలాగే నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, జనగాం, సిద్దిపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, గద్వాల జిల్లాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ 9 జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌.. 13 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుండి 50 కి. విూ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....