Telangana ఉద్యమానికి ఊపిరి పోసిన గాయకుడు గద్దర్

 హైదరాబాద్, ఆగష్టు 06 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోస్తూ, అనేక ఉద్యమ పాటలతో ప్రజా గాయకుడు గద్దర్  తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా నిలిచారు. ఆతను పాడిన అనేక పాటలు జనాల్లో ఏంతో చైతన్యాన్ని కలిగించాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ గీతాలు ఉద్యమ కారులకు ఎంతో బలాన్ని అందించాయంటే అతిశయోక్తి కలుగక మానదు. అసలు ఊపిరి పెట్టి పాడిన పాటలు ఎదుటి వ్యక్తి మనస్థితిని మార్చే అద్భుత సందర్భాన్ని గద్దర్ గుర్తు చేసేవాడంటే ఆశర్యం కలుగక మానదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యమానికి అతని విప్లవ గీతాలు ఉద్యమ కారుల గుండెల్లో వంద వంతుల ధైర్యాన్ని అందించాయి.ఊపిరి పోసిన పాటలు అవికూడా విప్లవ గీతాలు, అందులో  తెలంగాణ  సాయుధ పోరాటానికి అతను పాడిన పాటలు ఔరా అనిపిస్తాయి. గద్దర్ పాడిన బండెనక బండి కట్టి, పొడుస్తున్న పొద్దు మీద,  అమ్మ తెలంగానమ్మా పాటలు ఏంతో చైతన్య పరిచాయి.   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....