Tarnaka లో మేగా Blood డొనేషన్‌ Camp

హైదరాబాద్‌, ఆగస్టు 18, (ఇయ్యాల తెలంగాణ) : మేగా బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ ను తార్నాక లో నిర్వహించారు. ఈ శిబిరాన్ని వేణుగోపాల్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల కమిటీ చైర్మన్‌  బండి రమేశ్‌, కె. వెంకటేష్‌ గౌడ్‌, సారంగ పాణి, బీజేపీ రాష్ట్ర నాయకులు కిరణ్‌, కృష్ణవేణి, అమర్‌ తదితర కమిటీ సభ్యులు చురుకుగా పాల్గొని ఈ మహోన్నత సేవలో భాగస్వామ్యం అయ్యారు. ఈ సందర్భంలో నేతలు మాట్లాడుతూ, రక్తదానం ఒక ప్రాణరక్షక కర్తవ్యం అని, మరింత మంది ముఖ్యంగా యువత ఇటువంటి మానవతా కార్యక్రమాలలో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ఉదయమకారులు ఈ  బ్లడ్‌ డొనేషన్‌ క్యాంప్‌ లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భవిష్యత్తులోనూ సమాజ సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో తాము నిరంతరం భాగస్వామ్యం అవుతామని తెలంగాణ ఉద్యమకారుల కమిటీ పునరుద్ఘాటించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....