Tank Bund లో గరిష్ఠ స్థాయికి నీటి మట్టం !

హైదరాబాద్‌, జూలై 16, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ లో కూడా నిన్న పలుచోట్లు భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో హుస్సేన్‌ సాగర్‌ లో నీటి మట్టం చాలా కాలం తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, శానిటేషన్‌ సిబ్బందిని హుటాహుటిన రంగంలోకి దించారు. హుస్సేన్‌ సాగర్‌ గరిష్ఠ నీటిమట్టం 514.75 విూటర్లు కాగా… ప్రస్తుత నీటిమట్టం 513.41 విూటర్లుగా ఉంది. మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి పరిస్థితిని సవిూక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్న రాత్రి హైదరాబాద్‌ లో 8.9 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదయింది. వరదనీటి కారణంగా పలు ప్రధాన రహదారులపై అక్కడక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీని కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు

ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్‌ లోని హుస్సేన్‌ సాగర్‌ నీటి మట్టాలు దాదాపు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, శానిటేషన్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బంది నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి నిల్వలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్‌ నగరంలో  రాత్రి 10 గంటల వరకు సగటున 8.9 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. రహదారులపై భారీగా వరద నీరు చేరింది. ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్లు, ఆటోలతో పాటు ద్విచక్ర వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....