విద్యార్థుల Bus Pass చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలి: ABVP

హైదరాబాద్‌ జూన్‌ 11 (ఇయ్యాల తెలంగాణ) : విద్యార్థుల బస్‌ పాస్‌ చార్జీలను పెంచే ఆలోచనను విరమించుకోవాలని ఎబివిపి డిమాండ్‌ చేసింది వవ మేరకు బుదవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌`కూకట్పల్లి విభాగ్‌, సికింద్రాబాద్‌ జిల్లా, ూఖీ నగర్‌ శాఖ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్‌ జిల్లా కన్వీనర్‌ చెర్క.బాలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలు అమలు చెయ్యలేకపోవడమే కాక  పేద,బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చెయ్యాలనే కుట్రలో భాగంగా ప్రజా పాలన అంటూ పేదల పెన్నిధి అంటూనే ఇలాంటి ప్రతిపాదనల ద్వారా పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుంది ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తెచ్చి 400 నుండి 600 రూపాయలు బస్‌ చార్జీలను పెంచడం దాదాపుగా ఒకేసారి 20 నుండి 25% పెంచడమే కాక గత మూడు సంవత్సరాల్లో 200% ఫీజు పెంచడం సరికాదని అన్నారు.కావున వెంటనే ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకొని పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఊరట కల్పించాలని లేని పక్షంలో రాష్ట్రమంతా ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు… ూఈఆ సిటి కన్వీనర్‌ పాండురంగ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం కావాలనే పేద,మధ్య తరగతి విద్యార్థులను విద్యకు దూరం చేయడమే లక్ష్యంగా ఈ బస్‌ చార్జీలను 20% పెంపు నిర్ణయాన్ని తీసుకుందని ఆరోపించారు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులను విద్యకు దూరం చేయాలని సిగ్గుమాలిన చర్యను మానుకొని బస్సు ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెన్నక్కి తీసుకొని సామాన్య మధ్యతరగతి విద్యార్థులను విద్యను అందుకునే విధంగా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ూఖీనగర్‌ టౌన్‌ సెక్రటరీ నందు,సోహాన్‌ కుమార్‌ మరియు నగర కార్యకర్తలు పాల్గొన్నారు…

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....