హైదరాబాద్ జూలై 10 (ఇయ్యాల తెలంగాణ) : సైదాబాద్ ప్రాంతంలో శ్రీ వారాహి సెలెక్షన్స్ సూటింగ్, షర్టింగ్ వస్త్ర దుకాణాన్ని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి లాంఛనంగా ప్రారంభించారు. పాతబస్తీకి చెందిన సీనియర్ నాయకులు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివ కుమార్ కూతురు అల్లుడు నూతనంగా ప్రారంభిస్తున్న వస్త్ర దుకాణాన్ని మంత్రి వివేక్ వెంకట స్వామి ముఖ్య అథితిగా పాల్గొని ప్రారంభోత్సవమ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ శ్రీ వారాహి వస్త్ర దుకాణం అంచలంచలుగా ఎదిగి మరిన్ని వస్త్ర దుకాణాలు ప్రారంభించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి అందరితో కలివిడిగా మాట్లాడుతూ బుంగ శివ కుమార్ కు కాకా వెంకట స్వామి పై ఉన్న అభిమానాన్ని అప్పటి స్నేహ పూర్వక వాతావరణాన్ని గుర్తు చేశారు. శ్రీ వారాహి వస్త్ర దుకాణం ప్రారంభోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.
- Homepage
- Telangana News
- శ్రీ వారాహి సెలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మంత్రి
శ్రీ వారాహి సెలెక్షన్స్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మంత్రి
Leave a Comment