SC/ST ఉపకుల వర్గీకరణ తీర్పును స్వాగతిస్తున్నాం: హరీష్‌రావు

హైదరాబాద్, ఆగష్టు  01 (ఇయ్యాల తెలంగాణ) : ఉపకుల వర్గీకరణ తీర్పుపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు కౌరవుల సభ మాదిరిగా నడుస్తున్నాయని విమర్శించారు. అంతిమంగా పాండవులే గెలిచారని ఇప్పుడు కూడా తామె గెలుస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం తప్పుడు సమాచారాన్ని సభలో చెప్పారని ఫైర్‌ అయిన హరీష్‌… టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానిని కలిసి వర్గీకరణ చేపట్టాలని కోరామన్నారు. ఆరోజు ప్రధాని కూడా సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం చాలా మంది ప్రాణ త్యాగం కూడా చేశారని వివరించారు. వర్గీకరణపై స్టాండ్‌ ఏంటో చెప్పాలని గాంధీభవన్‌ వద్ద ఉద్యమకారులు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తే నాడు కాంగ్రెస్‌ పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మకను స్వాగతిస్తున్నామన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....