SC/ST ఐక్యవేదిక –ఆషాడ మాసం బోనాల జాతర
చార్మినార్,జులై 17 (ఇయ్యాల తెలంగాణ) : ఆషాడ మాసం బోనాల జాతర ను పురస్కరించుకొని ఆదివారము పాతబస్తీ బోనాల సందర్భంగా తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ శివకుమార్ వారి నివాసం నుండి శ్రీ గాలి పోచమ్మ అమ్మవారికి,శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి ప్రత్యేక బోనాలు సమర్పించారు. పటేల్ నగర్ లోని గౌలిపుర నివాసం నుంచి పోతరాజుల నృత్యాలతో, ఆడుతూ పాడుతూ బయలుదేరినారు. పటేల్ నగర్ లో శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయానికి బయలుదేరి అమ్మవారికి ఒడిబియ్యం పోయడం జరిగింది తొట్టెల సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అక్కడనుండి అంబిక నగర్ శ్రీ గాలి పోచమ్మ దేవాలయానికి బయలుదేరి అమ్మవారికి ఒడిబియ్యం పోసి తొట్టెల సమర్పించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అమ్మవారికి తొట్టెలలు ఫలహారబండితో సకుటుంబ సమేతంగా కదలివెళ్లారు .
ఈ కార్యక్రమంలో బుంగ యాదగిరి. బుంగ అనిల్ కుమార్.బుంగ అశ్విన్ కుమార్.బుంగ సాయికుమార్. బుంగ శ్రవణ్ కుమార్.బుంగ సందీప్ కుమార్.బుంగ లిఖిత్ కుమార్. బుంగ ప్రదీమ్ కుమార్ తో పాటు మనోజ్ కుమార్. దేవరకొండ లక్ష్మణ చారి. నరేష్ చారి. మధు చారి. జనార్ధన్. పాల్గొన్నారు.