హైదరాబాద్, మే 20 (ఇయ్యాల తెలంగాణ) : సోషల్ మీడియాపై నిఘా పెట్టేందుకు హైదరాబాద్ పోలీసుల చేతికి సరికొత్త అస్త్రం దొరికింది. ఏఐ సాయంతో నెట్టింట ఫేక్ ప్రచారాలు చేసేవారు, సంఘ విద్రోహ శక్తులపై ఎప్పటికప్పుడు డేగ కన్ను పెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘సాక్ ఐ’ పేరుతో ఏఐ యాప్‌ను ప్రారంభించారు. తాజాగా ఈ సాక్ ఐ యాప్.. దానికి సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీసులు.. వెల్లడించారు. ఈ సాక్ ఐతో నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని సీపీ సజ్జనార్ వెల్లడించారు.ప్రస్తుతం సమాజం అంతా సోషల్ విÖడియాలోనే మునిగిపోయింది. ఏ విషయమైనా, మన ఆలోచనలు అయినా సోషల్ విÖడియాలో పంచుకోవడం అందరికీ అలవాటుగా మారిపోయింది. అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలోనే ప్రమాదకరమైన సమాచారం, విద్వేషాలను రెచ్చగొట్టడం, అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన విషయాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నేరాలను అరికట్టడం, నిందితులను పట్టుకోవడం కోసం.. పోలీసులు సోషల్ మీడియాను జల్లెడ పడుతున్నారు. కానీ రకరకాల సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు, వాటిలో కోట్ల కొద్ది అకౌంట్లను తనిఖీ చేయడం పోలీసులకు వీలు కావడం లేదు.
ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు సరికొత్త టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం టెక్నాలజీలో శరవేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో సోషల్ విÖడియాలో విద్వేషాలను రెచ్చగొట్టేవారిపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయ్యారు. సోషల్ విÖడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ ( సాక్ ఐ ) పేరుతో సరికొత్త ఏఐ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్‌కు విఘాతం కలిగించేలా.. సోషల్ విÖడియాలో తప్పుడు ప్రచారాలు చేసే వారిని గుర్తించడం, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టేలా ఈ అత్యాధునిక టెక్నాలజీ వ్యవస్థను హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం తయారు చేసింది.సోషల్ విÖడియాపై నిఘా పెట్టేందుకు గతంలో భారీగా సిబ్బంది అవసరం అయ్యేదని.. గంటల తరబడి శ్రమించాల్సి వచ్చేదని పేర్కొన్న పోలీసులు.. ఈ సాక్ ఐ ఏఐ యాప్ ద్వారా ఇక నుంచి అన్నీ ఆటోమేటిక్‌గా జరగనున్నాయి. ఈ సాక్ ఐలోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్‌బోర్డ్ ద్వారా డయల్ 100 కాల్స్.. ఇంటర్నెల్ ఇంటెలిజెన్స్ డేటా, హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రధాన సంఘటనలకు సంబంధించిన వివరాలను ఒకే చోటుకు తీసుకువచ్చి.. అధికారులకు పూర్తి అవగాహన కల్పిస్తుంది.ఇక సాక్ ఐని.. ప్రయోగాత్మక పరీక్షించగా.. అద్భుతమైన పనితీరును కనబరిచినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మొదట్లో పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 విద్వేషపూరిత, మతపరంగా రెచ్చగొట్టేలా చేసిన అంశాలను.. గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సోషల్ విÖడియా అకౌంట్లలో ఉన్న 126 పోస్ట్‌లను ఈ సాక్ ఐ గుర్తించింది.
ఇలాంటి కంటెంట్‌ను సోషల్ విÖడియా నుంచి తక్షణమే తొలగించడం ద్వారా నగరంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడటమే కాకుండా.. విద్వేషాలను రెచ్చగొట్టే వారిని గుర్తించడం సాధ్యమైందని పోలీసులు తెలిపారు.మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ సాక్ ఐ సిస్టమ్ దృష్టి పెడుతుందని పోలీసులు వెల్లడించారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్.. సైబర్ బుల్లీయింగ్, స్టాకింగ్ వంటి వాటిని కూడా గుర్తించి అలర్ట్ చేస్తాయని తెలిపారు. సోషల్ విÖడియాలో పెట్టిన పోస్టుల తీవ్రత ఆధారంగా వాటిని హై, విÖడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి.. అభ్యంతరకర పోస్టులను తొలగించేలా ఆయా సోషల్ విÖడియా ప్లాట్‌ఫాంలకు అలర్ట్ ఇస్తుందని పేర్కొన్నారు.వివాదాస్పద సోషల్ విÖడియా పోస్ట్‌లను మళ్లీ మళ్లీ షేర్ చేసే వారిని.. గుర్తిస్తుంది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోషల్ విÖడియాలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ప్రతీ ఫిర్యాదుకు ఒక యునిక్ ట్రాకింగ్ నంబర్ ఉంటుంది. ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎండ్ టు ఎండ్ మానిటరింగ్ చేస్తారు. హైదరాబాద్‌లో రోజూ జరిగే ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, మతపరమైన ఊరేగింపులపై ముందస్తు నిఘా ఉంచేందుకు ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్ ఏర్పాటు చేశారు. ఆయా కీవర్డ్స్ ఆధారంగా సోషల్ మీడియా కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ.. ఏదైనా ముప్పు ఉంటే పోలీసులను అలర్ట్ చేస్తుంది.ఈ అత్యాధునిక సాక్ ఐ ఏఐ టెక్నాలజీతో పోలీసులపై పనిభారాన్ని తగ్గించడమే కాకుండా.. నేరాలకు అడ్డుకట్ట వేయడంలో సమÖల మార్పులు వస్తాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టించేందుకు.. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు దీన్ని రూపొందించామని తెలిపారు. ప్రస్తుత టెక్నాలజీ కాలానికి అనుగుణంగా నేరగాళ్లు.. సోషల్ మీడియాలో అస్త్రంగా చేసుకుంటున్న తరుణంలో.. ఈ టెక్నాలజీతో వారిని సమర్థంగా ఎదుర్కొంటామన్నారు.
