RTC బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్ర గవర్నర్ తమిళ సై

 

హైదరాబాద్, ఆగష్టు 06 (ఇయ్యాల తెలంగాణ)  ఆర్టీసీ బిల్లుకు రాష్ట్ర గవర్నర్  తమిళ సై కొద్దిసేపటి క్రితం ఆమోదం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులకు పనికి వచ్చేలాగా ఆర్టీసీ బిల్లు ఉండాలని సూచిస్తూ 10 రకాల సూచనలతో బిల్లుకు ఓకే తెలిపారు. తానూ ఎప్పటికైనా తెలంగాణ కార్మికుల పక్షమేనని తమిళ సై ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కానీ గత మూడు రోజులుగా తీవ్ర ఉత్కంఠ మధ్య ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు  చేసిన  బిల్లు విషయంలో అనేక అనుమానాలకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా అనేక ఆశలతో ఎదురు చూస్తూ గవర్నర్ ఆమోదం కొరకు ఒక రోజు ఆర్టీసీ బస్సులను రెండుగంటల పాటు నిలిపి వేయడం  జరిగింది. కానీ 10 రకాల రెకమండేషన్ తో  రాష్ట్ర గవర్నర్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లకు ఆమోదం ప్రకటించారు.  

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....