13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ !
హైదరాబాద్, సెప్టెంబర్ 03 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో రాగల కొద్దిరోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో పాటు బంగాళాఖాతం వరకు విస్తరించిన రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.తెలంగాణలో ఎల్లో అలర్ట్తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముండటంతో 13 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ‘ఎల్లో అలర్ట’ జారీ చేసింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని పేర్కొంది.ఏపీలో మÖడు రోజుల పాటు వానలుఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల ఉరుములు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే సూచనలున్నాయని స్పష్టం చేసింది.అధికారుల హెచ్చరికలు I వర్షాల నేపథ్యంలో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారే ప్రమాదం ఉన్నందున సెప్టెంబర్ 3, 4 తేదీల్లో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. I వర్షం కురిసే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్‌ల కింద నిలబడవద్దని సూచించారు.
