Rain Alert 💧 ఒక్క రోజే ఏడాది వాన !

హైదరాబాద్‌, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) ; ఏడాదంతా కురవాల్సిన వాన ఒక్కరోజులోనే కురిసింది. ఆకాశానికి చిల్లుపడ్డట్టు, కడవలో నీళ్లు గుమ్మరించినట్టు ఏకధారగా కుంభవృష్టి వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో (గురువారం) ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో 64.98 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. ఫలితంగా జన జీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి లక్ష్మీదేవిపేటలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఇదే అత్యధిక వర్షపాతమని వెల్లడిరచింది. గతంలో 2013 జూలై 19న వాజేడులో 51.75 సెంటీవిూటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత లక్ష్మీదేవిపేటలో కుంభవృష్టి వాన కురిసిందిజకాగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీవిూటర్ల వర్షపాతం వర్షం కురిసింది. 200 కేంద్రాల్లో 10 సెంటీవిూటర్లకుపైగా వర్షపాతం నమోదైంది.

 హైదరాబాద్‌లో గత 6 గంటల్లో 60 మిల్లీవిూటర్ల వర్షపాతం నమోదైంది. ఈ రోజు నగరంలో 30 నుంచి 40 మిల్లీవిూటర్ల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడిరచింది.మరోవైపు ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ 60 శాతం అత్యధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. జూన్‌ 1 నుంచి 321.1 మి.విూ నమోదు కావాల్సి ఉంది. ఐతే ఇప్పటి వరకు దాదాపు 513.4 మి.విూ వర్షపాతం నమోదైంది. అంటే సగటు సాధారణ వర్షపాతం కంటే ఇది 60 శాతం అధికమని పేర్కొంది.

పరిస్థితిని సవిూక్షిస్తున్న సీఎం, మంత్రులు :

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనల నుంచి ప్రజలను రక్షిస్తూ, ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టే దిశగా మంత్రులను, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు వరదలకు సంబంధించి పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉన్నారు. మంత్రులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ప్రాణనష్టం జరగకుండా చూడాలని, అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన చికిత్స అందించేలా చూసుకోవాలని సీఎం కోరారు. ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా, అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ రక్షణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ మంత్రులకు ఫోన్లలో ఆదేశించారు.తక్షణ రక్షణ చర్యల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. 

సీఎం కేసీఆర్‌ గారి ఆదేశాలను అనుసరించి అన్ని రకాల చర్యలను చేపడుతూ సీఎస్‌ సెక్రటేరియట్‌ లో అధికారులతో సవిూక్షా సమావేశాలు, టెలీకాన్ఫరెన్స్‌ లు నిర్వహించారు. ముంపుకు గురైన ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎస్‌ బృందాలు, రక్షణచర్యల కోసం హెలికాప్టర్లు సహా, ఆహారం, వైద్యం తదితర రక్షణ సామాగ్రి, సంబంధిత శాఖల యంత్రాంగాన్ని పంపించేలా చర్యలు చేపట్టారు. విపత్తుల నిర్వహణ శాఖకు, ఫైర్‌ సర్వీసుల శాఖకు, పోలీసు శాఖతో సమన్వయం చేస్తూ సహాయక చర్యలు చేపట్టారు. అదే సందర్భంలో పోలీస్‌ యంత్రాంగాన్ని సహాయక చర్యల్లో పాల్గొనేలా అప్రమత్తం చేయాల్సిందిగా రాష్ట్ర డిజిపిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు స్టేట్‌ లెవల్‌ ఫ్లడ్‌ మానిటరింగ్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి.డిజిపి పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు పోలీసులు చేస్తున్న కృషి ఫలిస్తున్నది.ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి, దాని ఉపనదులు, వాగులు, వంకలు ప్రమాద హెచ్చరికలు దాటి ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితుల్లో, వరద ముంపును తగ్గించే చర్యలు చేపట్టాలనీ, ఈ మేరకు ఇన్‌ ఫ్లో ను ముందస్తు అంచనా వేసి, గేట్లు ఎత్తివే స్థూ, వరద నీటిని కిందికి వదలాలని చీఫ్‌ ఇంజనీర్లకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఆదేశాలిచ్చారు. 

ఈ మేరకు ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్టులు, కడెం ప్రాజెక్టు, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు తదితర ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్‌ ఫోన్లు చేసి, పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల పరిస్థితిని క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నారురాష్ట్రంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ప్రాణనష్టం జరగకుండా చూసేలా చర్యలు చేపట్టాలని ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ, సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రులకు సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్‌ జిహెచ్‌ఎంసి పరిధిలో విస్తృతంగా పర్యటన చేపట్టారు. వానలోనే తడుస్తూ, ప్రజలను పరామర్శిస్తూ, అధికార యంత్రాంగానికి ఆదేశాలిస్తూ రక్షణ చర్యల కోసం ముందుకు సాగారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ, సహాయ చర్యలను చేపట్టేలా జిహెచ్‌ఎంసి అధికారులకు ఆదేశాలిచ్చారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించి ప్రజలకు భరోసానిచ్చారు. జిహెచ్‌ఎంసి అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి, ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనెలా చర్యలు చేపట్టారు.

సీఎం కేసీఆర్‌ మంత్రి సత్యవతి రాథోడ్‌ కు ఫోన్‌ చేసి గోదావరి పరివాహక ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నీట మునిగిన మోరంపల్లి గ్రామంలో ప్రజలను రక్షించేలా పరిస్థితిని సవిూక్షించారు. స్వయంగా చలివాగుతో పాటు వరద ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ములుగు ముంపు ప్రాంతంలో కొనసాగుతన్న సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించి, అక్కడే బస చేస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ధర్మపురి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి, పునరావాస కేంద్రాలకు ప్రజలను తరలించి ప్రజలకు ఆహారం, దుస్తులు అందించారు.సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి హరీష్‌ రావు అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి, రాష్ట్రస్థాయిలో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి, జిల్లాల్లో కాల్‌ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కడ అవసరమైతే అక్కడ అత్యవసర వైద్య సదుపాయాలు అందించేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిజామాబాద్‌ జిల్లలో మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పునరావాస సహాయక చర్యలు చేపట్టారు. సీఎం కేసీఆర్‌ ప్రశాంత్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ స్థానిక పరిస్థితులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మేయర్‌ విజయలక్షి, అధికారులతో సవిూక్షించారు.కడెం ప్రాజెక్టు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కడెం ప్రాజెక్టు పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇంద్రకరణ్‌ రెడ్డికి ఫోన్‌ చేసి పరిస్థితులను ఆరా తీశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఉదయం భద్రాచలంలో ప్రత్యేకాధికారి అనుదీప్‌ తో కలిసి గోదావరి వరద పరిస్థితిని పరిశీలించారు. ఖమ్మం జిల్లా మున్నేరువాగులో చిక్కుకున్న వారిని రక్షిచేందుకు స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ రంగంలోకి దిగారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సహాయక కార్యక్రమాలు చేపట్టి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందుకు సంబంధించి మంత్రి పువ్వాడతో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సవిూక్షించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....