హైదరాబాద్, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజుల పాటు నగరంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్ర శేఖర్ రావు అన్ని విద్య సంస్థలకు ఆదేశాలు ఇవ్వవలసినదిగా విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్ర రెడ్డి కి ఆదేశాలు అందించారు. హైదరాబాద్ లో రెడ్ అలర్ట్ దృష్ట్యా జూలై 26, 27 తేదీలలో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జరీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేసింది.