హైదరాబాద్, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజలు వర్షాల నేపథ్యంలో ఎలాంటి అత్యవసర సేవలకోసమైనా సంప్రదించవలసిన ఫోన్ నంబర్లను GHMC ప్రకటించింది. రానున్న 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో ఎక్కడైనా చెట్లు విరిగిపడినా, పురాతన భవనాలు కూలినా డ్రైనేజి వ్యవస్థ భారీగా వర్షపు నీరు చేరి ఇబ్బందులకు గురైనా ఈ కింద సూచించిన నంబర్లలో సంప్రదించవలసిందిగా GHMC ప్రకటించింది.వరదల రక్షణ మరియు చెట్టు పడిపోయినప్పుడు సహాయం కోసం 040-21111111 మరియు 9000113667 డయల్ చేయవలసిందిగా GHMC డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రకటన జారీ చేసింది.