పూలే స్ఫూర్తిని యువత ఆదర్శింగా తీసుకోవాలి : MP ఈటల

హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఇయ్యాల తెలంగాణ) : సైనిక్ పురిలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలలో ఎంపి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగ ఈటల మాట్లాడుతూ ఈ దేశం గర్వించే ముద్దుబిడ్డ, ఈ దేశానికే రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ కి గురువుగా, మార్గదర్శకంగా నిలిచిన మహానీయుడు మహాత్మ జ్యోతిబాపూలే అని అన్నారు..

పూలే  199వ జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకోవడం, ఆయన ఆశయాలను మరోసారి నేమరువేసుకొని, ఆయన త్యాగాలకు స్ఫూర్తి పొంది ఈ తరం మాత్రమే కాదు రాబోయే తరాలు కూడా త్యాగమంటే, ప్రజాహితం కోసం పనిచేయడం అంటే ఏంటో ఆయన జీవితమే ఒక ఆదర్శం. పూలే  అడుగుజాడల్లో నడిచిన వారి సతీమణి సావిత్రిబా పూలే  మొట్టమొదటగా దేశంలో మహిళలకు చదువు ఉంటేనే సమాజం బాగుపడుతుంది అని నమ్మి… ఆనాటి ఉన్మాదానికి వ్యతిరేకంగా, సనాతన పద్ధతులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆడపిల్లలకు చదువు చెప్పిన మొట్టమొదటి గురువు సావిత్రిబాయి పూలే.

మిలటరీ, స్పేస్, అడ్మినిస్టేషన్, అన్ని రంగాలతో పాటు రాబోతున్న 33% రిజర్వేషన్లలో కూడా సావిత్రిబాపూలే వేసిన పునాది భారతదేశంలోని మహిళ లోకానికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. రేపు అసెంబ్లీ, పార్లమెంట్లో కూడా ఈ దేశహితం కోసం జరిగే చట్ట నిర్మాణంలో కూడా మహిళలకు 33% నరేంద్ర మోడీ చేయాలనుకున్న సంకల్పం దానికి పునాది వేసిన మహానాయకురాలు సావిత్రిబాపూలే.  200 ఏళ్ల క్రితం పుట్టిన వీరు భారతదేశానికి వెలుగు, స్ఫూర్తినిచ్చే మహనీయులు కాబట్టి ఆ మహా పురుషులు ఎన్నటికీ మరణించరు… వాళ్ళ ఆశయాలు సజీవంగానే ఉంటాయి. వాళ్ల  స్ఫూర్తి ఈ దేశ యువత ఆదర్శంగా తీసుకొని ముందుకి కదలాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.  మహాత్మ జ్యోతిబా పూలే, సావిత్రిబా పూలే కు ఘనమైన నివాళులర్పిస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో నేరెడ్మేట్ మాజీ కార్పొరేటర్ ఉపేందర్ రెడ్డి,  మాల్కాజ్గిరి మాజీ కార్పొరేటర్ శ్రవణ్,  వినాయకనగర్ మాజీ కార్పొరేటర్ రాజ్యలక్క్ష్మి,  మౌలాలి మాజీ కార్పొరేటర్ సునీత యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాణిక్ రెడ్డి,  గోపు రమణ రెడ్డి,  సీనియర్ నాయకులు వి కే మహేష్,  మౌలాలి డివిజన్ అధ్యక్షులు శివ, , బుల్లెట్ స్వప్న, , గణేష్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....