Public ను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం

ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు.. రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ జూలై 26 (ఇయ్యాల తెలంగాణ) : హైదరాబాద్‌ లో గత వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఎంపీ, టీపీసీసీ అధ్యక్షులు.. రేవంత్‌ రెడ్డి విమర్శించారు.ముఖ్యమంత్రి కేసీఆర్‌ కానీ, మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ గానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్నారు.పురపాలక శాక మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు మోజులో ఉండి ప్రజలను మరచిపోయారని ఎద్దేవా చేసారు.ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సవిూక్ష చేయడంలేదన్నారు.వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తము అల్లకల్లోలంగా మారిందన్నారు..తీవ్ర వర్షాలతో వాతావరణ శాఖ ఇప్పటికే రాష్ట్రంలో అలెర్ట్‌ ప్రకటించింది. అయిన కూడా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్నారు.ట్రాఫిక్‌ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. గంటలకొద్దీ రోడ్లపైనే ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు.హైదరాబాద్‌ విశ్వనగరంగా అభివర్ణించారు. హైదరాబాద్‌ డల్లాస్‌, ఓల్డ్‌ సిటీ ఇస్తాంబుల్‌ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్‌, కేటీఆర్‌ హైదరాబాద్‌ నరక కూపంగా మార్చారని దుయ్యబట్టారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నాలా లు, వరద ప్రాంతాలకు వెళ్లకూడదని,పాత భవనాలు, గోడలు, పాడు బడ్డ ఇళ్ల వద్ద జాగ్రత్త గా ఉండాలి. పిల్లలలను బయటకు పంపవద్దని కోరారు.రాష్ట్రంలో గతంలో వరదలతో భారీ ఆస్తి, ప్రాణ నష్టాలు, పంట నష్టాలు వచ్చాయి.గత 9 ఏళ్లుగా హైదరాబాద్‌ లో సౌకర్యాల కల్పన, ప్రజలకు మేలు జరిగే ఒక్క చర్య చేపట్టలేదు.ఈ విషయాలపై కాంగ్రెస్‌ శ్రేణులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలి.బుధ, గురు వారాలలో రెండు రోజులలో ప్రభుత్వం ప్రజలకు సరైన  సేవలు అందించి ఆదుకోవాలి.లేకపోతే శుక్రవారం నాడు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....