హైదరాబాద్, జనవరి 3 (ఇయ్యాల తెలంగాణ) : తప్పు చేసి అడ్డంగా దొరికినా.. బొంకి బయటకు రావొచ్చనే ప్లాన్ వేశాడో, లేక ఆధారాలు లేకుండా వీళ్లేం చేస్తారని ఫిక్స్ అయ్యాడో.. మొత్తానికి ఐబొమ్మ రవి తాజాగా మాట్లాడుతున్న తీరు, బాడీ లాంగ్వేజ్ చూస్తున్నవాళ్లంతా షాక్ అవుతున్నారు. తప్పు చేసి పశ్చాత్తాపం కనిపిస్తుందని అంతా అనుకుంటే , తప్పే చేయకుండా విూ ఓవర్ యాక్షన్ ఏంటన్నట్లుగా విూడియా ప్రశ్నలకు రివర్స్‌లో సమాధానాలిస్తున్నాడు ఐబొమ్మ కేసులో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు రవి.విచారణలో భాగంగా పోలీసులు ఏ ప్రశ్నలు అడిగినా తడుముకోకుండా సమాధానం చెబుతున్న ఐబొమ్మ రవి, అడిగిన ప్రశ్నలు మళ్లీ అడిగితే మాత్రం కళ్లు ఉరిమి చూస్తున్నాడట. పైరసీ గుట్టు బయటపడ్డాక , సినీ ప్రముఖులను సైతం ఈ కేసులో ఇరికించడానికి విశ్వప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది.
సైబర్ క్రైమ్ డిసీపి ఆధ్వర్యంలో 12రోజులపాటు నిందితుడు రవిని విచారించిన పోలీసులు , రవి ఇచ్చే సమాధానాలకు షాకవ్వాల్సి వస్తోందట. మాటలు మార్చి మార్చి మాట్లాడుతూ, చివరకు పరిచయం ఉన్న స్నేహితులు, బంధువులను సైతం విూరెవరు , ఇప్పుడే చూస్తున్నా అంటూ వింత సమాధానాలతో నట విశ్వరూపం చూపిస్తున్నాడట.ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన రవి, వెబ్ సైట్స్ పోటీ విపరీతంగా పెరగడంతో , వాటి నుండి తట్టుకునేందుకు పట్టుకోండి చూద్దామంటూ ఫేక్ పోస్టర్ ను క్రియేట్ చేసి, పోలీసులకు సవాలు విరిసినట్లుగా తెలుస్తోంది. సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు, బయటి వ్యక్తులతో కలిసి ఇదంతా చేస్తున్నారని నమ్మించే ప్రయత్నం చేసినట్లుగా విచారణలో వెలుగు చూసినట్లు సమాచారం. వీ ఆర్ ఇన్ఫో టెక్ పేరుతో ఐబొమ్మ, బప్పం టీవీలను వెబ్ సైట్ లను రిజిస్టర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ,ఇప్పటికే ఆయా కంపెనీలకు మెయిల్ పంపి అదనపు సమాచారం సేకరిస్తున్నారు. తాను పైరసీ సినిమాలు వెబ్ సైట్ లో పెట్టలేదని, కేవలం ఆయా డొమైన్లకు సర్వీసు మాత్రమే ఇచ్చానంటూ తాజాగా కొత్త రాగం అందుకున్నాడు. ఐబొమ్మ రవి విచారణలో వ్యవహరిస్తున్న తీరుతో పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నాడు. తనతో కలిసి రూమ్ లో ఉన్న స్నేహితులను సైతం గుర్తించడంలో వీర లెవిల్ లో నటిస్తున్నాడు. రవి స్నేహితులైన అంజయ్య, ప్రహ్లాద్, కాళీ ప్రసాద్ కు మాయమాటలు చెప్పి ,వారి వద్ద ఆధార్ ,పాన్ కార్డులను తీసుకుని ,వాటిని మార్చి నకిలీ పత్రాలు సంపాదించడం, ఫోర్జరీ సంతకాలు చేయడం చేసేవాడు. ఇలా తన పేరు క్రైమ్ సీన్ లో లేకుండా చేసేందుకు అవసరమైన అన్ని అడ్డదారులు తొక్కాడు. ప్రాణ స్నేహితుడైన ప్రహ్లాద్ ను పోలీసులు చూపిస్తే , ఇదే మొదటి సారి చూస్తున్నా, అతనెవరో నాకు తెలియదంటూ బుకాయిస్తున్నాడు. అంతేకాదు ఏకంగా పోలీసులకు సైతం తాను నేరం చేశాననే రుజువుందా, నడిపింది ఐబొమ్మ అనే ఆధారాలు ఉంటే చూపండి అంటూ అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడట.