Policeల దాడిలో గాయపడిన గిరిజన మహిళను పరామర్శించిన Red Cross

హైదరాబాద్‌ ఆగష్టు 19 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్ర గవర్నర్‌ తమిళ సై సౌందర్య రాజన్‌  ఆదేశాల మేరకు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ హైదరాబాద్‌ జిల్లా శాఖ మామిడి భీమ్‌ రెడ్డి ఆగస్టు 15 వ తేదీన రాత్రి డ్యూటీ లో వున్న పోలీస్‌ అధికారులు లక్ష్మి అనే మహిళ విూద ఎల్బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో థర్డ్‌ డిగ్రీ ఉపయోగించి చిత్ర హింసలు పెట్టిన సంఘటనలో గాయపడిన గిరిజన మహిళ లక్ష్మిని, కర్మన్‌ ఘాట్‌లోని జీవన్‌ హాస్పిటల్‌లో పరామర్శించారు.డాక్టర్లతో మాట్లాడి ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని తెలిపారు. ఆమెకు పండ్లు, మందులు, రెడ్‌ క్రాస్‌ సామగ్రిని అందించి విూకు అన్ని వేళల రెడ్‌ క్రాస్‌ హైదరాబాద్‌ జిల్లా శాఖ అందుబాటులో వుంటుందని భరోసా ఇచ్చారు. జరిగిన ఘటనపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. రెడ్‌ క్రాస్‌ వాలంటీర్లు దీక్షితులు, వెంకట్‌, గోపాల్‌ తదితరులు వెంట వెళ్లి పరామర్శించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....