POCSO కేసులో దోషికి 51 ఏళ్ల జైలు శిక్ష.!

నల్లగొండ,  ఆగష్టు 26  (ఇయ్యాల తెలంగాణ) : పోక్సో కేసులో నల్గొండ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 51 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. అంతేకాదు 85 వేలు జరిమానా విధిస్తూ బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించాలని నల్గొండ జిల్లా కోర్టు ఆదేశించింది.నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు ఖయ్యూంకి ఈ కఠిన కారాగార శిక్షను కోర్టు విధించింది. క్రైమ్‌ నం.242/2021, తిప్పర్తి పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సీ, నం.94/2022)లో, తిప్పర్తి గ్రామం, మండలానికి చెందిన నిందితుడు ఖయ్యూంను ఎస్సీ ఎస్టీ కోర్ట్‌ జడ్జి రోజా రమణి దోషిగా తేల్చారు. అత్యాచారానికి 20 సంవత్సరాల కారాగార శిక్ష, 

ఫోక్సో  చట్టం కింద మరో 20 సంవత్సరాల కారాగార శిక్ష, ఎస్సీ, ఎస్టి సంబంధిత సెక్షన్‌, చట్టం కింద 10 సంవత్సరాల కారాగార శిక్షను విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.వీటితో పాటు.. ఐపీసీ సెక్షన్‌ 506 కింద ఒక సంవత్సరం కారాగార శిక్షను కూడా విధించారు. బాధితురాలు, 16 ఏళ్ల బాలిక ఎస్టి కమ్యూనిటీకి చెందిన అమ్మాయి 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....