Phone ట్యాపింగ్ కేసులో ముగిసిన BRS కీలక నేత హరీష్‌రావు విచారణ

హైదరాబాద్‌, జనవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ కీలక నేత హరీష్‌రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ కొనసాగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని శనివారం సాయంత్రం సిట్ అధికారులు హరీష్‌రావుకు నోటీసులు పంపించడంతో ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం 6.30 గంటలకు వరకు అధికారులు ఆయనను ప్రశ్నించారు.అయితే విచారణ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆరఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిట్ అధికారులైన ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్‌రెడ్డి ఆయనను విచారించారు.కాగా ఈ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆరఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలుసుకుని ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తెలంగాణ భవన్ నుంచి జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బయలుదేరి రావడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....