సికింద్రాబాద్, జులై 18 (ఇయ్యాల తెలంగాణ ) : కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్నే పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ఆగష్టు 10 న్యూ ఢిల్లీ పార్లమెంట్ భవనం ముందు జరిగే మహాప్రదర్శనలో పెద్దఎత్తున పాల్గొని తమ నిరసనను తెలపాలని రైల్వే కార్మికులకు రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ లోని సంఘ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్ఎఫ్ఐఆర్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య మాట్లాడుతూ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో రైల్వే బోర్డు రైల్వే మంత్రిత్వ శాఖ విఫలమైందని ఆరోపించారు.
ఒక వైపు రైల్వే కార్మికులు పని ఒత్తిడి గురవుతుంటే మరో వైపు కొత్త పెన్షన్ విధానం వలన ఆర్థిక పరమైన ఇబ్బందులు గురవుతున్నారని, కార్మికులు నష్టపోతారన్నారని పేర్కొన్నారు. అనేక సార్లు రైల్వే బోర్డు, తో పాటు రైల్వే మంత్రిత్వ శాఖలకు కొత్త పెన్షన్ రద్దు చేయాలని కోరుతు లేఖ రాశామన్నారు. రైల్వే కార్మికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 10న డిల్లీ పార్లమెంట్ కార్యాయలం వద్ద రైల్వే కార్మికులతో మహా ధర్నా చేపడుతున్నామని 17 జోనలో పనిచేస్తున్న లక్షల మంది కార్మికులు ఉద్యోగులు సొంత ఖర్చులతో ఆగస్టు 10న మహాధర్నాకార్యాక్రమానికి హజరతారని మర్రి రాఘవయ్య వెల్లడించారు.