‘ఓజీ’ సినిమాకు Telangana హైకోర్టులో ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఓజీ సినిమాకు తెలంగాణ హైకోర్టు లో ఎదురుదెబ్బ తగిలింది.  బెనిఫిట్‌ షో, టికెట్‌ రేట్లు పెంపు మెమోను కోర్టు సస్పెన్షన్లో పెట్టింది.  ఎజీ ‘ సినిమా టికెట్‌ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్‌ చేసింది. ఈ ఆదేశం సినిమా ప్రేక్షకుల్లో చర్చనీయాంశంకాగా, ఫిల్మ్‌ ఇండస్ట్రీకి షాకింగ్‌ గా  మారింది. 

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ‘ఓజీ’ సినిమాకు ప్రత్యేకంగా టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు, బెనిఫిట్‌ షోలు నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. ఈ మెమో.. సాధారణ టికెట్‌ ధరలతో పాటు అదనపు ఛార్జీలు వసూలు చేసి, ప్రేక్షకుల నుంచి ఎక్కువ ఆదాయం సంపాదించుకునేందుకు వీలు కల్పిస్తుంది. అయితే, ఈ నిర్ణయంపై నమోదైన కేసును పరిశీలించిన తెలంగాణ హైకోర్టు, దీన్ని తాత్కాలికంగా ఆపేసింది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా ఉన్నాయని, ప్రేక్షకుల హక్కులను దెబ్బతీస్తాయని స్పష్టం చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....