హైదరాబాద్, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : చారిత్రాత్మక నాంపల్లి యూసుఫియన్ దర్గా లో వర్షపు నీరు నిండిరది. భారీ వర్షానికి మోకాలు దాకా నీళ్లు రావడంతో భక్తులు నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఎప్పుడు లేని విధంగా వర్షం నీళ్ళు వచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భక్తుల నుండి కోట్ల రూపాయలు విరాళాలు పొందుతూ…కనీస వసతులు లేకపోవడం దారుణమని ఆవేదన చెందుతున్నారు. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చిన నిధులు , భక్తుల విరాళాలు ఇలా కోట్ల రూపాయలు నిర్వహకులు మింగేస్తున్నారని ఆరోపించారు. కోట్ల రూపాయలు దండుకుంటున్న నిర్వాహకులు…ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.