హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధాని మోడీ నాయకత్వాన్ని బలపరిచేందుకే భారతీయ జనతా పార్టీలోకి వెళుతున్నట్లు పి ఎల్ శ్రీనివాస్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తను టిఆర్‌ఎస్ ను వీడి బిజెపిలోకి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు. కెసిఆర్ నేతృత్వంలోని టిఆర్‌ఎస్ పార్టీలోకి చేరిన అనంతరం పులి లాంటి నన్ను పిల్లిలా మార్చారని వాపోయారు. ఈనెల 15న మహబూబ్ కాలేజీ క్యాంపస్ లో నిర్వహించనున్న సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు లక్ష్మణ్ సమక్షంలో బిజెపి లోకి వెళుతున్నట్లు చెప్పారు. తన కుమార్తె అలేఖ్య కూడా పార్టీలో చేరుతుందని తెలిపారు.
- Homepage
- Telangana News
- Modi నాయకత్వాన్ని బలపరచందుకే BJPలోకి : `PL శ్రీనివాస్
Modi నాయకత్వాన్ని బలపరచందుకే BJPలోకి : `PL శ్రీనివాస్
Leave a Comment