MLA సీతక్క కు BC యువసేన ‘‘రక్షక్‌ దళం’’లక్ష రూపాయల విరాళం

హైదరాబాద్‌ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలు తో ములుగు నియోజక వర్గ ప్రాంతం అతలాకుతము అయిన విషయము అందరికీ తెలిసిందే. ఆయా ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాల బ్రతుకులు చిద్ర మైపోయాయి. పశువులు, పక్షులు సైతం వరదల్లో కొట్టుకుపోయి బ్రతుకులు చీకటిమయం అయిపోయాయి.వరదల్లో పుస్తకాలు కొట్టుకుపోయి విద్యార్థుల బ్రతుకులు అగమ్య గోచరంగా తయారయ్యాయి. ఈ తరుణంలో స్థానిక ఎమ్మెల్యే సీతక్క వెను వెంటనే స్పందించి ఆయా ప్రాంతాలను పరిశీలించి బాధితులను ఆదుకోవడం కోసం ఎడతెరిపిలేని సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఆవిడ చేస్తున్న సేవా కార్యక్రమాలకు చెలించి పోయిన బిసి యువసేన ‘‘రక్షక్‌ దళం’’ సభ్యులు హైదరాబాదులో సీతక్కను కలిసి వరద బాధితుల కు తగు విధం గా సహాయము నిమిత్తం లక్ష రూపాయలు అందించారు. ఈ ఆర్ధిక సాయాన్ని విద్యార్థులకు పుస్తకాలు కొని అందించడానికి మరియు తగు విధం గా అవసరార్థం తక్షణం ఉపయోగిస్తామని సీతక్క హావిూ ఇచ్చారు. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌, 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ  ఆధ్వర్యంలో బిసి యువసేన జాతీయ సమన్వయకర్త  పెచ్చటి మురళీ రామకృష్ణా రెడ్డి తో పాటు  రక్షక్‌ దళం సభ్యులు గుత్తుల రమణమూర్తి, గుబ్బల వెంకటరమణ, వాసంశెట్టి నాగార్జున, మద్దూరి రాజు, సాగ బాలకృష్ణ తదితరులు సీతక్కను  కలిసిన వారి లో ఉన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....