Medaram జాతరలో ప్రత్యేక ఆకర్షణగా కోయ దొరలు

మేడారం,  ఫిబ్రవరి 22 (ఇయ్యాల తెలంగాణ) :  మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర కు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.జాతర సందర్భంగా మేడారం పరిసరాలు జన సందోహం తో నిండిపోయాయి. కోట్లాది మంది భక్తులు కొంగు బంగారం అయిన సమ్మక్క సారలమ్మ జాతర లో కోయ దొరలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.దట్టమైన అడవులలో దొరికే అనేక రకాల వనమూలికల మొక్కలు ,వేర్లు,చెట్ల కొమ్మలను తీసుకు వచ్చి జాతరకు వచ్చే భక్తులకు విక్రయిస్తున్నారు..తాము ఆదివాసిలం  అని అడవులలో జీవిస్తూ సమ్మక్క సారలమ్మల ఉపవాస దీక్ష చేపట్టి నిష్ఠతో పూజలు నిర్వహించి  అన్ని రోగాలకు సంబంధించిన మూలికలను తమ పూర్వీకుల నుండి తెలుసుకొని నేటికీ అదే కొనసాగిస్తూ ఎంతో మంది ప్రజలకు నయం చేసినట్లు చెబుతున్నారు. 

భక్తుల నమ్మకానికి అనుగుణంగా వారి వారి రోగాలు నయం అవుతాయని కోయ దొరలు జ్యోతిష్యం తో వారి జాతకం నిజమవుతుందనీ కొందరు భక్తులు తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....