వైభవంగా ఓదెల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కళ్యాణ మహోత్సవం
`కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించిన శాసనసభ్యులు విజయరమణ రావు
పెద్దపల్లి, ఫిబ్రవరి 24 ఇయ్యాల తెలంగాణ : పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం సందర్బంగా సోమవారం కుటుంబ సమేతంగా హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కుటుంబ సమేతంగా శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ మల్లిఖార్జున స్వామి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చేయుటకు శాయశక్తులా కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నా రు. మల్లన్న స్వామి దయతో పెద్దపల్లి ప్రాంత ప్రజలందరు సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని కోరుకున్నట్టు ఎమ్మెల్యే విజయరమణ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్, చీకట్ల మొండయ్య,వ రెడ్డి రజనికాంత్, ఆకుల మహేందర్, నాగపూరి రావి, బోడగుంట శంకర్, చొప్పరి రాజయ్య, అంకం రమేశ్,అజ్జు, రాకేష్,కుమార స్వామి, దేవేందర్, వీరయ్య, గోపతి సాది, చింతం కుమార స్వామి, పచ్చిమాట్ల శ్రీనివాస్, నర్సింగం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ అధికారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.