KTR కే పూర్తి బాధ్యతలు !

హైదరాబాద్‌, జూలై 30, (ఇయ్యాల తెలంగాణ) : తిపక్షనేత హోదాలో మొదటి సారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్‌.. మళ్లీ ఫాంహౌస్‌కి వెళ్లిపోయారు. దాంతో అధికారంలో ఉన్నంత కాలం యువరాజులా చెలాయించిన కేటీఆర్‌పై పాపం పెద్ద భారమే పడినట్టు కనిపిస్తుంది. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలకు సమాధానం చెప్పుకోవాలి. అటు అధికారపక్షం నేతల విమర్శలకు వివరణలు ఇచ్చుకోవాలి. మరోవైపు పదేళ్లు మిత్రత్వం కొనసాగించిన ఎంఐఎం కూడా ఇప్పుడు బీఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతోంది. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్యేలు కారు దిగిపోతుండటంతో సతమతమవుతున్న కేటీఆర్‌.. ఈ ముప్పేట దాడితో ఒంటరి అయిపోతున్నారు.తెలంగాణలో కాళేశ్వరం కేంద్రంగా డైలాగ్‌ వార్‌ కంటిన్యూ అవుతుంది. ఇరు పార్టీల మధ్య వాటర్‌ వార్‌ హైవోల్టేజ్‌కి చేరుకుంది. బీఆర్‌ఎస్‌ చలో మేడిగడ్డతో కాళేశ్వరం పంచాయితీ కాక రేపుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ నుంచి రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు నీటి ఎత్తిపోతలను ప్రారంభించాలన్నారు. ఆగస్టు 2 వరకు గడువిస్తున్నామని,  స్పందించకుంటే కేసీఆర్‌ నాయకత్వంలో 50 వేల మంది రైతులతో కలిసి మోటార్లను ప్రారంభిస్తామని హెచ్చరించారు కేటీఆర్‌.  కుంగుబాటు వెనుక కాంగ్రెస్‌ కుట్ర ఉందని కేటీఆర్‌ సంచలన ఆరోపణ చేశారు. రాబోయే రోజుల్లో మేడిగడ్డకు కాంగ్రెస్‌తో ప్రమాదం పొంచి ఉందని కామెంట్‌ చేశారాయన.తమ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. కాళేశ్వరం ఎత్తిపోతల ఘోర తప్పిదమని.. ఏ సీఎం కూడా ఇలా చేసి ఉండరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో నిర్మించిన కాళేశ్వరంపై పూర్తిస్థాయి అధ్యయనం చేసి ప్రాజెక్టును తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పారు.

ఇక మరో సీనియర్‌ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే బీఆర్‌ఎస్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేస్తున్నారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్‌నేనని..  కేటీఆర్‌ ఆరోపించినట్లు కుట్రలు చేస్తే డ్యామ్‌ లోపలికి ఎలా కుంగుతుందని ప్రశ్నించారు. అయినా పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్లు రాని ఆ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తీసిపారేశారు. కాళేశ్వరం పేరుతో రెండు లక్షల కోట్ల రూపాయలు గంగపాలు చేశారని ఆ డబ్బులతో వేలాది ఇందిరమ్మ ఇండ్లు కట్టేవాళ్లం అని పేర్కొన్నారు.ఆధారాలతో సహా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేక బీఆర్‌ఎస్‌ సతమతమవుతుంది. ఇప్పుడు ఎంఐఎం కూడా వారికి తోడైంది. బీఆర్‌ఎస్‌ హయంలో పాతబస్తీ అభివృద్ధికి నోచుకోలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ విమర్శించారు. వాళ్ల దృష్టి మొత్తం గచ్చిబౌలి వైపే ఉందని మండిపడ్డారు. ఓల్డ్‌ సిటీలో దుర్భర పరిస్థితులు ఉన్నా పట్టించుకున్న నాదుడే గత పదేళ్లలో లేడని. కేటీఆర్‌ను అడిగితే ఇదిగో అదిగో అని కాలం వెళ్లదీశారనిఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ మాటలు అద్భుతంగా చెప్పేవారు కానీ.. పనులు మాత్రం శూన్యమని సెటైర్లు విసిరారు.కాంగ్రెస్‌ నేతలకే కేటీఆర్‌ పళ్లబిగువున సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. పవర్‌లో ఉన్నప్పుడు పాతబస్తీపై బోల్డు ప్రేమ ఒలకపోసిన ఆయన ఇప్పుడు అక్బర్‌ ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారో చూడాలి. మొత్తానికి బీఆర్‌ఎస్‌ ఒంటరి అయిపోయిటన్లే కనిపిస్తోందిప్పుడు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....