KARGIL విజయ దివాస్‌ సందర్భంగా సిద్దిపేట లో ర్యాలీ

పాల్గోన్న అడిషనల్‌ డీసీపీ యస్‌. మల్లారెడ్డి 

సిద్దిపేట, జులై 26 (ఇయ్యాల తెలంగాణ) : కార్గిల్‌ విజయ దివాస్‌ సందర్భంగా సిద్దిపేట లో నిర్వహించిన   ర్యాలీలో అడిషనల్‌ డీసీపీ యస్‌. మల్లారెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీసీపీ మాట్లాడుతూ కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ 25వ వార్షికోత్సవం పురస్కరించుకుని ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలతో కలిసి సిద్దిపేట పట్టణం బిజెఆర్‌ చౌరస్తా నుండి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి  ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. మరియు జూలై 26 1999 భారతదేశ సైన్యం పాకిస్తాన్‌ సైన్యంపై వీరోచితంగా పోరాడి  విజయం సాధించిన దానిని గుర్తుగా ఈ దినోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్‌ సైన్యాన్ని తిప్పి కొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ఎంతోమంది సైనికులు వీరమరణం పొందారు. భారత్‌ సైనికులు విజయం సాధించారు.  అందువల్ల ప్రతి ఏటా జూలై 26న వారిని స్మరించుకోవడం కోసం కార్గిల్‌ విజయ్‌ దివాస్‌ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ర్యాలీని విజయవంతం చేసిన ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాన్ని అభినందించారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట ఏసీపీ మధు, వన్‌ టౌన్‌ ఇన్స్పెక్టర్‌ లక్ష్మీ బాబు, త్రీ టౌన్‌ ఇన్స్పెక్టర్‌ విద్యాసాగర్‌, మరియు పోలీస్‌ సిబ్బంది ప్రవేట్‌ స్కూల్‌ యాజమాన్యం మరియు విద్యార్థిని విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....