కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయిన KCR

విచారిస్తున్నప్పుడు ఆరోగ్యం సరిగాలేదు బహిరంగ విచారణ కాకుండా..వ్యక్తిగతంగా విచారించండి

హైదరాబాద్‌ జూన్‌ 11 (ఇయ్యాల తెలంగాణ) :  మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యారు. కమిషన్‌ చీఫ్‌ పిసి ఘోష్‌ కెసిఆర్‌ను విచారిస్తున్నప్పుడు ఆరోగ్యం సరిగాలేదని కమిషన్‌కు ఆయన తెలిపారు. బహిరంగ విచారణ కాకుండా..వ్యక్తిగతంగా విచారించాలని చంద్రశేఖర్‌ రావు కోరడంతో కాళేశ్వరం కమిషన్‌ అంగీకరించింది. కమిషన్‌ హాల్‌లో కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. హాల్‌లో కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పిసి ఘోష్‌, కమిషన్‌ కార్యదర్శి మురళీధర్‌, కెసిఆర్‌ మాత్రమే ఉన్నారు. కెసిఆర్‌ తో ముఖాముఖి విచారణ కొనసాగుతుంది. బిఆర్‌ కె భవన్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న బిఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. పోలీసులకు, బిఆర్‌ఎస్‌ కార్యక్తరల మధ్య తోపులాట జరిగింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....