K C R విూద పోటీకి ఈటెల జమున సై

హైదరాబాద్‌ సెప్టెంబర్ 11 (ఇయ్యాల తెలంగాణ ): గజ్వేల్‌ బీజేపీ టికెట్‌ కోసం ఈటెల రాజేందర్‌ సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ సీఎం కేసీఆర్‌ పోటీ చేయనున్నారన్నది తెలిసిందే. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం దరఖాస్తులు ర్ఖస్తులు ఆహ్వానించగా ఆదివారం తో గడువు ముగిసింది. మొత్తం 6,003 దరఖాస్తులు రాగా చివరిరోజు 2,780 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అరవింద్‌, కిషన్‌ రెడ్డి, సోయం బాపు రావు, డీకే అరుణ, లక్ష్మణ్‌ దరఖాస్తు చేసుకోలేదు. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌ నుండి దరఖాస్తు చేయగా హుజూరాబాద్‌ నుండి ఈటెల రాజేందర్‌, గజ్వేల్‌ నుండి ఆయన సతీమణి ఈటెల జమున దరఖాస్తు చేసుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....