June 27 నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

హైదరాబాద్‌, మే 24 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎప్‌ ఎప్‌సెట్‌ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఎప్పుడా అని చూస్తున్న తరుణంలో తెలంగాణ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజనీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.జూన్‌ 27వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుండగా, జూన్‌ 30 నుంచి విద్యార్థులు మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అనంతరం జులై 12వ తేదీన మొదటి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఇక ఈసారి ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ మొత్తం మూడు విడతల్లో జరగనుంది. జులై 19 నుంచి ఇంజినీరింగ్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇక రెండో విడత సీట్ల కేటాయింపు జులై 24వ తేదీన జరగనుంది. అలాగే తుది విడత కౌన్సెలింగ్‌ను జులై 30 వతేదీన నిర్వహించి, ఆగస్టు 5వ తేదీన చివరి విడత సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.ఇదిలా ఉంటే ఇంటర్నల్‌ స్లైడిరగ్‌ ఆన్‌లైన్‌లో కన్వీనర్‌ ద్వారా చేపట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్‌ స్లైడిరగ్‌ ప్రక్రియను చేపట్టనున్నారు. అలాగే ఆగస్టు 16న ఇంటర్నల్‌ స్లైడిరగ్‌ సీట్ల కేటాయింపు ఉండనుంది. ఇక ఆగస్టు 17న స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....