ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి Conditions అప్లై…!

AI సాయంతో అక్రమాలకు చెక్‌

ఖమ్మం, హైదరాబాద్, జనవరి 18 (ఇయ్యాల తెలంగాణ) :  పేదల సొంతింటి కలను నెరవేర్చి, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తెలంగాణ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు పథకం’ అమలు చేస్తోంది. ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు కూడా ఈ పథకానికి అర్హులే. నియోజకవర్గానికి 3,500 చొప్పున తొలి విడతలో 4,16,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పూరిగుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో ఉంటున్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సొంత స్థలం ఉన్నవారికి తొలి దశలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ ద్వారా పనుల పురోగతిని అప్‌డేట్‌ చేస్తుండగా.. ఏఐ సాంకేతికతో అక్రమాలను గుర్తించి, చర్యలు తీసుకుంటున్నారు. సొంతిల్లు నిర్మించుకోవడం అనేది ఎలాంటి వారికైనా ఒక అపురూపమైన కల. మరి పేదలకు సొంతిల్లు నిర్మించుకోవడం అనేది చాలా పెద్ద కల. పేదలకు, గూడు లేనివారికి సొంతింటి కలను నిజం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ‘ఇందిరమ్మ ఇళ్లు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేదలైన, సొంత ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం లేదా ఇంటి స్థలంతో పాటు ఆర్థిక సాయం అందిస్తారు.

👉 ఈ పథకం పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు స్టేటస్‌ తెలుసుకునే విధానం,

👉 లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు..

తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పక్కా ఇల్లు నిర్మించుకోవడానికి సహాయం అందించడమే ఇందిరమ్మ ఇళ్లు పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం ద్వారా కింది విధంగా లబ్ధి చేకూరుస్తారు..

1) ఆర్థిక సహాయం: సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు.

2) స్థలం G ఆర్థిక సహాయం: సొంత స్థలం లేని వారికి ఇంటి స్థలం కేటాయించడంతో పాటు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు.

3) ఎస్సీ, ఎస్టీలకు అదనపు సహాయం: ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ. 5 లక్షలతో పాటు అదనంగా రూ. 1 లక్ష (మొత్తం రూ. 6 లక్షలు) ఆర్థిక సహాయం అందిస్తారు.ఇంటి నిర్మాణం వివిధ దశల్లో ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.

ఉదాహరణకు.. పునాది పూర్తయిన తర్వాత రూ. 1 లక్ష, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత రూ. 1.25 లక్షలు, స్లాబ్‌ నిర్మాణ సమయంలో రూ. 1.75 లక్షలు అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించాలని రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తొలి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 22,000 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది.

ఇందిరమ్మ ఇళ్లు పథకానికి ఎవరు అర్హులు ?

దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పర్మినెంట్‌ నివాసి అయి ఉండాలి.

దారిద్య్రరేఖకు) దిగువన ఉన్న కుటుంబాలు, లేదా ఆర్థికంగా వెనుకబడిన వర్గా ప్రజలు అర్హులు.

దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తారు.

దరఖాస్తుదారుడికి లేదా అతడి కుటుంబానికి సొంత పక్కా ఇల్లు ఉండకూడదు.

గుడిసెలు, తాత్కాలిక ఇళ్లలో నివసించే వారికి ప్రాధాన్యం ఇస్తారు.

దరఖాస్తుదారుడు గతంలో ఏ ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధి పొంది ఉండకూడదు (ముఖ్యంగా 1995 తర్వాత). రేషన్‌ కార్డు ఆధారంగా లబ్ధిదారుడిని ఎంపిక చేస్తారు.

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

ఒంటరి మహిళలు, వితంతువులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందిరమ్మ ఇళ్లు అధికారిక వెబ్‌సైట్‌:

ష్ట్రబిబిజూబ://తినిటతితీజీఎఎజీతినిటశ్రీబీ.బివశ్రీజీనిణజీనిజీ.ణనీల.తిని/


https://indirammaindlu.telangana.gov.in

ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోనివారు.. కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందిరమ్మ ఇళ్లు పథకం నిరంతరంగా కొనసాగుతుందని, అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోచ్చునని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గ్రామ పంచాయతీలు లేదా వార్డు కార్యాలయాలు లేదా మండల కార్యాలయాల నుంచి ప్రజా పాలన దరఖాస్తు పత్రాలను పొందవచ్చు. ఈ దరఖాస్తు ఫారమ్‌లను జాగ్రత్తగా నింపి, అవసరమైన పత్రాలను జతచేసి ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సమర్పించాలి.ఇందిరమ్మ ఇళ్లు పథకానికి దరఖాస్తులను ‘ప్రజా పాలన’ కార్యక్రమం ద్వారా స్వీకరించారు. 

2023 డిసెంబర్‌ 28 నుంచి 2024 జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పాలన దరఖాస్తులను స్వీకరించారు. ఇళ్ల కోసం మొత్తం 77.18 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 36.03 లక్షల (46.7 శాతం) మంది మాత్రమే అర్హులని గుర్తించారు. మిగతా 41.15 లక్షల (53.3 శాతం) మందిని అనర్హులుగా తేల్చారు. అనర్హులందరూ దారిద్య్రరేఖ (బీపీఎల్‌)కు ఎగువన ఉన్నవారేనని అధికారులు నిర్ధారించారు.మొత్తం దరఖాస్తుదారుల వివరాలను తెలంగాణ గృహ నిర్మాణ శాఖ ఎల్‌`1, ఎల్‌`2, ఎల్‌`3 జాబితాలుగా సిద్ధం చేసింది. దీని ప్రకారమే ప్రతి ఆర్థిక సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున.. రాష్ట్రవ్యాప్తంగా ఏటా గరిష్టంగా 4.50 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఇళ్ల దరఖాస్తుల వివరాలను ఇందిరమ్మ యాప్‌లో నమోదు చేశారు. యాప్‌లో పొందుపరిచిన మార్గదర్శకాల ప్రకారం క్షేత్ర స్థాయిలో సిబ్బంది అన్ని కోణాల్లో సర్వేలు నిర్వహించారు. దీంతో పాటు ప్రభుత్వం నిర్వహించిన ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా తీసుకున్న వివరాలను కూడా పరిశీలించి లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. దరఖాస్తుదారులను ఎల్‌`1, ఎల్‌`2, ఎల్‌`3గా విభజించారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రస్తుతం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో లేదు. భవిష్యత్తులో ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించవచ్చు.

👉 ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఏంటి?

👉 ఆధార్‌ కార్డు

👉 రేషన్‌ కార్డు / ఆహార భద్రతా కార్డు 

👉 కుటుంబ ఆదాయ ధ వీకరణ పత్రం 

👉 నివాస ధృవీకరణ పత్రం

👉 కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)

👉 మైనారిటీ ధృవీకరణ పత్రం (అవసరమైతే)

👉 బ్యాంకు ఖాతా వివరాలు (బ్యాంకు పాస్‌బుక్‌ జీరాక్స్‌)

👉 భూమి యాజమాన్య పత్రాలు (సొంత స్థలం ఉన్నవారికి)

దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్‌ సైజు ఫోటోలబ్ధిదారులను గుర్తించేందుకు ఇందిరమ్మ కమిటీలను నియమించారు. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఇందిరమ్మ కమిటీలు ప్రధాన పాత్ర పోషించాయి. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కేటాయించినట్లు తేలితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. క్షేత్ర స్థాయి సిబ్బంది, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు పలు విడతలుగా పరిశీలించి అర్హులను గుర్తిస్తున్నారు.ఎంపికలో అతిపేదలు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు ప్రాధాన్యం ఇస్తారు. పూరిగుడిసెలు లేదా పెంకుటిళ్ళలో నివసిస్తున్న వారికి తొలి దశలో ఇళ్లను నిర్మించి ఇస్తారు. గ్రామసభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాలను గుర్తిస్తారు. తుది జాబితాను గ్రామసభలో ప్రదర్శించి, అభ్యంతరాలను స్వీకరిస్తారు.

నియోజకవర్గాల వారీగా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షిస్తారు.ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు యాప్‌ తీసుకొచ్చింది. ఈ మొబైల్‌ యాప్‌ల ద్వారా దరఖాస్తుల పరిశీలన జరుగుతోంది. అధికారులు దరఖాస్తుదారుల వద్దకు వెళ్లి ఫోటోలు తీసుకుని, వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. సొంత స్థలం ఉన్న వారిని అదే స్థలం దగ్గర ఉంచి, జియో ట్యాగింగ్‌ ద్వారా ఫోటో తీస్తున్నారు.పార్టీలకు అతీతంగా, ఎలాంటి సిఫారసులకు తావులేకుండా, నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రయోజనం చేకూరాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాలు, పట్టణాల వారీగా ఎక్కడెక్కడ ఎన్ని కేటాయించాలనే దానిపై అధికారులు దృష్టి సారించారు.

మొత్తం 3,500 ఇళ్లలో గ్రామాలు, పట్టణాల వారీగా మంజూరు చేసిన వాటి వివరాలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రికి సమర్పిస్తే, ఆయన ఆమోదం తెలుపుతారు. అనంతరం ఎన్ని మంజూరయ్యాయో మళ్లీ గ్రామసభల్లో ప్రదర్శిస్తారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల మంజూరులో ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఇందిరమ్మ యాప్‌లో తప్పుడు సమాచారం నమోదు చేస్తే, సులభంగా గుర్తిస్తోంది. ఇందిరమ్మ యాప్‌లో గుంతలు, పునాది, పిల్లర్లు, స్లాబు, గోడలు, ఇంటి స్వరూపం లాంటి ఫొటోలను సిబ్బంది అప్‌లోడ్‌ చేశారు. దరఖాస్తుదారులకు సంబంధించిన సమగ్ర సమాచారం రికార్డై ఉంటుంది. పనుల పురోగతిపై యాప్‌లో వివరాలు నమోదు కాగానే, లబ్ధిదారుడి వివరాల ఆధారంగా ఏఐ వాటిని పరిశీలిస్తుంది. ఉండాల్సిన దానికంటే భిన్నంగా కనిపిస్తే వెంటనే గుర్తిస్తుంది. దీని ఆధారంగా అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి, అక్రమాలు తేలితే చర్యలు తీసుకుంటారు.ఇళ్ల పునాది నిర్మాణాలు పూర్తి కాకున్నా, తప్పుడు ఫోటోలను అప్‌లోడ్‌ చేసి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు చేసే ప్రయత్నాలను ఏఐ సాంకేతికతతో గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో 18 ఇళ్ల నిర్మాణాల పునాదులు పూర్తయ్యాయంటూ బిల్లుల కోసం ఆన్‌లైన్‌లో వివరాలు, ఫొటోలు నమోదు చేయగా.. తేడా ఉన్నట్లు ఏఐ గుర్తించడంతో అధికారులు పరిశీలించి, బిల్‌ కలెక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.

లబ్ధిదారుల ముఖ కవళికలు

ఇల్లు నిర్మించాల్సిన స్థలం అక్షాంశ, రేఖాంశాలు

ఇంటి స్వరూపం (ఆర్‌సీసీ/ ఏసీ షీట్‌/ తాటాకులు/ ప్లాస్టిక్‌ షీట్‌ రూఫ్‌)

ఇంటి నిర్మాణ దశల ఫొటోలు

లబ్ధిదారుడి వివరాలు

ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్‌ 2025

యాప్‌ సర్వేలో ఇందిరమ్మ ఇంటికి అర్హులేనని తేలినప్పటికీ.. సమగ్ర కుటుంబ సర్వేలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్లు, ఇతర ప్రాంతంలో ఇల్లు, కారు ఉన్నట్లు తేలితే, అలాంటివారిని అనర్హులుగా గుర్తించి దరఖాస్తులను పక్కన పెట్టేస్తున్నారు. పూర్తి వడపోత తర్వాత జూన్‌ 18న అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు. జూన్‌ 21 నుంచి గ్రామసభలు ఏర్పాటు చేసి ఈ జాబితాలను ప్రదర్శిస్తారు. అభ్యంతరాలను పరిశీలించి, తుది జాబితాను సిద్ధం చేస్తారు. జూన్‌ 26వ తేదీ లోపు ఈ ప్రక్రియ పూర్తికానుంది.

దరఖాస్తు స్టేటస్‌ ఎలా తెలుసుకోవాలి?

తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్‌ను

(ష్ట్రబిబిజూబ://తినిటతితీజీఎఎజీతినిటశ్రీబీ.బివశ్రీజీనిణజీనిజీ.ణనీల.తిని/)

రూపొందించినప్పటికీ.. ప్రస్తుతం ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇందిరమ్మ ఇళ్లు పథకం దరఖాస్తు స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకునేందుకు వివరాలు లేవు. భవిష్యత్తులో ఆధార్‌ నంబర్‌/ మొబైల్‌ నంబర్‌/ రేషన్‌ కార్డు నంబర్‌ సాయంతో అప్లికేషన్‌ స్థితిని తెలుసుకునే సదుపాయాన్ని కల్పించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల విభజన ఇలా..

ఒ1 (లిస్ట్‌ 1): సొంత స్థలం ఉండి, పక్కా ఇల్లు లేని వారు. వీరికి మొదటి విడతలో ప్రాధాన్యం ఇస్తారు. సొంత స్థలంలో గుడిసె, పూరిపాక, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారిని కూడా ఈ జాబితాలో చేర్చారు.

ఒ2 (లిస్ట్‌ 2): సొంత స్థలం లేదా పక్కా ఇల్లు లేని పౌరులు. గుడిసెల్లో, తాత్కాలిక ఇళ్లలో నివాసం ఉంటున్నవారు. వీరికి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సహాయం అందిస్తారు.

ఒ3 (లిస్ట్‌ 3): ఇప్పటికే పక్కా ఇల్లు ఉండి, వార్షికాదాయం రూ. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు. వీరు ఈ పథకానికి అర్హులు కారు.

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి ఏవైనా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి లేదా ఫిర్యాదులు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం 040`29390057 అనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నంబర్‌కు పని దినాల్లో కాల్‌ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.


iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....