ఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టు జాతికి అంకితం
ప్రధాని మోడీకి గవర్నర్ కృతజ్ఞతలు : గవర్నర్ తమిళి సై
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : ఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్టుని జాతికి అంకితం చేసినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలని గవర్నర్ తమిళి సై అన్నారు. మంగళవారం నాడు ఐఐటి లో జరిగిన కార్యక్రమానికి ఆమె హజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. నేను తెలంగాణకి గవర్నర్ గా వచ్చినప్పుడు నేను పని చేస్తానో లేదోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేశారు. నేను గైనకాలజిస్ట్ ని పిల్లని తల్లి ఎలా చూసుకోవాలో నాకు తెలుసు, పుదుచ్చేరి రాష్ట్ర బాధ్యతలు కూడా ఇచ్చినప్పుడు కవల పిల్లలు పుడితే ఎలా చుసుకోవాలో డాక్టర్ గా తెలుసు. కరోనా సమయంలో ఐఐటీ హైదరాబాద్ తయారు చేసిన వెంటిలేటర్లు ఎంతోమంది ప్రాణాలు కాపాడాయని అన్నారు.