Hyderabad పరిధిలో భారీగా పెరిగిన పూల ధరలు !

హైదరాబాద్, సెప్టెంబర్‌ 16, (ఇయ్యాల తెలంగాణ) : వినాయక చవితి సందర్భంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా.. నూతన పండుగ శోభ కనిపిస్తుంది. నగరాల్లోనే కాకుండా గల్లీ ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల గణనాధుని విగ్రహాలను కొనుగోలు చేసిన కమిటీ సభ్యులు వాటిని మండపాలకు తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. వినాయక చవితి రాక ముందే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పండుగ శోభ సంతరించుకుంది. వినాయక చవితి పండగ నేపథ్యంలో మార్కెట్లో వ్యాపారాలు స్పీడ్‌ అందుకున్నాయి. ఇదే సమయంలో పూజల కోసం ఉపయోగించే పూల అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి.హైదరాబాద్ మోజం జాహీ మార్కెట్, సికింద్రాబాద్ మోండా మార్కెట్, గుడి మల్కాపూర్  మార్కెట్‌ లో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మొన్నటి వరకు శ్రావణ మాసం కావడంతో .. ఆత్యధికంగా వివాహాది శుభకార్యాలు జరిగాయి.. ఈ నేపథ్యంలో పూల వ్యాపారం బాగానే సాగింది.. వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. 

ఆ సమయం ఇప్పుడు ఇలా ముంగిసిందో లేదో.. వినాయక చవితి పండుగ రానుండటంతో పూలకు మళ్లీ భారీ డిమాండ్‌ ఏర్పడింది. మరో వైపు గణేష్‌ మండపాలను ప్రత్యేకంగా పూలతో అలంకరించేందుకు మండపాల కమిటీ సభ్యులు పూల వ్యాపారులకు అడ్వాన్సు కూడా చెల్లిస్తున్నారని చెబుతున్నారు..అంతే కాదు, వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని తమకు తగిన కూలి సైతం అందుతుందని.. రోజుకు 500 రూపాయల నుండి 1000 రూపాయలు వరకు సంపాదిస్తున్నామని పూల వ్యాపారులు చెప్తున్నారు. వరుస పండగలు వస్తుండటంతో తమ వ్యాపారాలు బాగున్నాయని ఆనందం వ్య్వక్తం చేస్తున్నారు.. పండుగ రాక మునుపే వ్యాపారాలు ఊపందుకోవడంతో హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని  పలువురు పూల వ్యాపారులు ఆర్డర్ర్‌ లు బుక్‌ చేస్తున్నారు.. పెద్ద పూల దండల నుంచి చిన్న చిన్న దండల వరకు కొనుగోలు అయ్యే అవకాశాలు అధికమైన నేపథ్యంలో తాము బెంగుళూరు, హైదరాబాదు నుండి పూలను దిగుమతి చేసుకున్నట్లుగా కొందరు పూల వ్యాపారులు తెలిపారు. పూల ధరలు సైతం యధా స్థితిలో ఉండడంతో, పూల ధరలలో ఎటువంటి మార్పు రాలేదని, వినాయక చవితి పర్వదినం సందర్భంగా జరిగే పూల కొనుగోళ్లపై తాము ఆశాజనకంగా ఉన్నామన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....