Group1లో పాసైన తండ్రి, కొడుకులు

హైదరాబాద్‌, జూలై 8,  (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫలితాలు జులూ 7న విడుదలైన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే తాజా ఫలితాల్లో ఖమ్మం పట్టణానికి చెందిన తండ్రి, కొడుకులు అర్హత సాధించారు. దాసరి రవికిరణ్‌ ముచ్చర్ల (53) అనే వ్యక్తి జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్‌ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు మైకేల్‌ ఇమ్మానియేలు (25) దూర్యవిద్యలో డిగ్రీ పూర్తి చేశారు. ఇటీవల తెలంగాణలో నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు మైకెల్‌తోపాటు అతని తండ్రి రవి కిరణ్‌ కూడా దరఖాస్తు చేసుకున్నారు.53 ఏళ్ల వయస్సున్న రవికిరణ్‌ కుమారుడికి అవసరమైన సూచనలు ఇవ్వడంతోపాటు.. తానూ పరీక్ష రాశారు. కుమారుడికి ఇన్పిరేషన్‌గా ఉండేందుకు ఆయన ఈ పరీక్ష రాశాడు. రిజర్వేషన్‌, ఇన్‌ సర్వీసు కోటాలో వయో మినహాయింపు ఉండటంతో ఆయన పరీక్ష రాయగలిగారు. అయితే అనూహ్యంగా ఆదివారం వెలువడిన ప్రిలిమ్స్‌ ఫలితాల్లో కుమారుడితోపాటు తండ్రి కూడా మెయిన్స్‌కు క్వాలిఫై కావడంతో ఒక్కసారిగా రాష్ట్రం అంతటా వీరి పేర్లు మారుమ్రోగిపోయాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....