GROUP 2 వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ TSPSC ముట్టడి

 మద్దతు తెలిపిన కాంగ్రెస్‌, తెలంగాణ జన సమితి.. తీవ్ర ఉద్రిక్తత..

హైదరాబాద్‌ ఆగష్టు 10 (ఇయ్యాల తెలంగాణ ):  టీఎస్‌పీఎస్సీ ముందు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వేలాది మంది అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీని ముట్టడిరచారు. టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు కాంగ్రెస్‌ తెలంగాణ జన సమితి మద్దతు తెలిపింది. అభ్యర్థులకు మద్దతుగా నిరసనలో ప్రొఫెసర్‌ కోదండరాం, అద్దంకి దయాకర్‌ ఇతర కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు. వేలాది మంది టీఎస్పీఎస్సీ అభ్యర్థులను పక్కకి పంపించి పోలీసులు ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు.గ్రూప్‌ 2 వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ టీఎస్‌పీఎస్సీ దగ్గర వేలాది మంది అభ్యర్థులు బైఠాయించారు. వరుస ఎగ్జామ్స్‌ నేపథ్యంలో తమకి ప్రిపరేషన్‌కి సమయం లేదని అభ్యర్థులు వాయిదా కోరుతున్నారు. ఇప్పటికే ఈ నెల 3 నుంచి 22 వరకు గురుకుల, జేఎల్‌, డిఎల్‌ పరీక్షలు జరుతున్నాయి. గ్రూప్స్‌కి సమయం ఎక్కడ అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వచ్చే నెలలో టెట్‌ పరీక్ష జరగనుంది. ఇప్పటికే పలు ఎగ్జామ్స్‌ పేపర్‌ లీకేజీ జరిగిన అదే బోర్డుతో ఎగ్జామ్స్‌ ఎలా నిర్వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....