Group` 1 Exam – Results ప్రకటించొద్దు – High Court ఆదేశం

హైదరాబాద్‌ జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) :  గ్రూప్‌ ` 1 పరీక్షల ఫలితాలు సోమవారం వరకు ప్రకటించ వద్ధంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌ `1 పరీక్షకు సంబంధించి ఎన్‌ఎస్‌యూఐతో పాటు పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గ్రూప్‌`1 పరీక్షలో బయోమెట్రిక్‌ పెట్టలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై మంగళవారం  హైకోర్టులో విచారణ జరిగింది. త్వరలో గ్రూప్‌ ` 1 ఫలితాలు ప్రకటించేందుకు టీఎస్‌పీఎస్సీ యోచిస్తోందని కోర్టుకు పిటిషనర్లు తెలిపారు. ఫలితాలు ప్రకటించకుండా స్టే విధించాలని కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారని కోర్టుకు ఏజీపీ తెలిపారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ జరిగే వరకు గ్రూప్‌ ` 1 ఫలితాలు ప్రకటించవద్దని హైకోర్ట్‌ ఓరల్‌ ఆర్డర్‌ జారీ చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....