Group – 1 ప్రిలిమినరీ Examsలకు బందోబస్తు నిర్వహించే పోలీస్‌ అధికారులకు దిశా నిర్దేశం

సిద్దిపేట,జూన్ 08 (ఇయ్యాల తెలంగాణ) : సిద్దిపేట పట్టణంలో 21 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది..! బయోమెట్రిక్‌ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతి లేదు. పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ బి. అనురాధ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల చుట్టూ 360 డిగ్రీ  ఆవరణలో పటిష్టమైన బందోబస్తు  ఏర్పాటు చేయడం జరుగుతుంది  పరీక్షా కేంద్రాలకు సవిూపంలో పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్‌ డీసీపీలు 2, ఏసీపీలు,4 సీఐలు 14, ఎస్‌ఐలు 21, ఏఎస్‌ఐలు,హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మహిళా కానిస్టేబుళ్లు హోంగార్డులు 257, మొత్తం పోలీస్‌ అధికారులు సిబ్బంది 298 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రూట్‌ మొబైల్స్‌, 3 ఎస్కార్ట్‌ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. 

ఈ సమావేశంలో  ఎగ్జామ్స్‌ పోలీస్‌ నోడల్‌ అధికారి ఏఆర్‌ అడిషనల్‌ డీసీపీ సుభాష్‌ చంద్రబోస్‌, సిద్దిపేట ఏసీపి మధు, ట్రాఫిక్‌ ఏసిపి సుమన్‌ కుమార్‌, టాస్క్‌ ఫోర్స్‌ ఏసిపి రవీందర్‌, ఇన్స్పెక్టర్లు, సిఐలు  ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....