సిద్దిపేట,జూన్ 08 (ఇయ్యాల తెలంగాణ) : సిద్దిపేట పట్టణంలో 21 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది..! బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల చుట్టూ 360 డిగ్రీ ఆవరణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది పరీక్షా కేంద్రాలకు సవిూపంలో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయడం జరిగింది అడిషనల్ డీసీపీలు 2, ఏసీపీలు,4 సీఐలు 14, ఎస్ఐలు 21, ఏఎస్ఐలు,హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు మహిళా కానిస్టేబుళ్లు హోంగార్డులు 257, మొత్తం పోలీస్ అధికారులు సిబ్బంది 298 మందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రూట్ మొబైల్స్, 3 ఎస్కార్ట్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో ఎగ్జామ్స్ పోలీస్ నోడల్ అధికారి ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, సిద్దిపేట ఏసీపి మధు, ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఏసిపి రవీందర్, ఇన్స్పెక్టర్లు, సిఐలు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.